EO RELEASES SRI KRT BTUs WALL POSTERS_ తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

Tirupati, 11 March 2018: The annual brahmotsavams of Lord Sri Kodanda Rama Swamy in Tirupati i will be observed from March 16 to 24.

TTD EO Sri Anil Kumar Singhal released the posters for the same in his chambers in TTD administrative building on Sunday.

Speaking on this occasssion he said that special programmes such as cultural and spiritual will be organized by TTDs Hindu Dharma Prachara Parishad, Dasa Sahithya Project and Annamacharya Project during Brahmotsavam.

The nine-day brahmotsavams in the famed temple of Lord Sri Kodanda Rama will commence with Dwajarohanam on March 16. While the other important days include Garuda Seva on March 20, Rathotsavam on March 23, Chakrasnanam on March 24.

CVSO Sri Ake Ravikrishna, FACAO Sri O Balaji, DyEOs Smt Gouthami, Smt Jhansi Rani and others were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

మార్చి 11, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. బ్రహ్మోత్సవాలు మార్చి 16 నుండి 24వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. మార్చి 15వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

తేదీ ఉదయం సాయంత్రం

16-03-2018(శుక్రవారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం

17-03-2018(శనివారం) చిన్నశేష వాహనం హంస వాహనం

18-03-2018(ఆదివారం) సింహ వాహనం ఉగాది ఆస్థానం/

ముత్యపుపందిరి వాహనం.

19-03-2018(సోమవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

20-03-2018(మంగళవారం) పల్లకీ ఉత్సవం గరుడ వాహనం

21-03-2018(బుధవారం) హనుమంత వాహనం వసంతోత్సవం/గజ వాహనం

22-03-2018(గురువారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

23-03-2018(శుక్రవారం) రథోత్సవం అశ్వవాహనం

24-03-2018(శనివారం) పల్లకీ ఉత్సవం/చక్రస్నానం ధ్వజావరోహణం

గోడపత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, ఎఫ్‌ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, డెప్యూటీ ఈవో(జనరల్‌) శ్రీమతి గౌతమి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.