JEO COMMENCES PULSE POLIO_ తిరుమలలో పల్స్‌పోలియో లాంఛనంగా ప్రారంభించిన తిరుమల జెఈవో
Tirumala JEO Sri KS Sreenivasa Raju commenced pulse polio drop administration in Tirumala on Sunday in front of Srivari temple.
Speaking on this occasion he said, “TTD has set up 21 centres for pilgrims and four for locals in Tirumala. The polio drops will be administered today up to 7pm. The mopping will take place on Monday and Tuesday also”, he added.
SMO Dr Muralidhar, Dr Narmada and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
తిరుమలలో పల్స్‌పోలియో లాంఛనంగా ప్రారంభించిన తిరుమల జెఈవో
మార్చి 11, తిరుమల 2018: మార్చి 11వ తారీఖున ఆదివారంనాడు దేశవ్యాప్తంగా నిర్వహించిన 24వ విడత పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా తిరుమలలో టిటిడి ఆధ్వర్యంలో సీనియర్ మెడికల్ అధికారి డా|| మురళీధర్‌తో కలిసి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుమలలో 25 ప్రాంతాలలో పల్స్‌పోలియో కేద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో 21 ప్రాంతాలలో భక్తులకు, 4 ప్రాంతాలలో స్థానికులకు,
ఉద్యోగులకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జనవరి 28వ తేదీ తిరుమలలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో దాదాపు 7 వేల మందికి పైగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వివరించారు. ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు జరిగే పల్స్‌పోలియో కార్యక్రమంలో భక్తులు మరియు స్థానికులు 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు విధిగా పల్స్‌పోలియో చుక్కలు వేయించుకోవాలని ఆయన కోరారు.
కాగా అశ్విని ఆసుపత్రి నేతృత్వంలో అశ్విని, జియన్‌సి, ఆర్‌టిసి బస్టాండ్, సిఆర్‌ఓ, పిఏసి 1 మరియు 2, ఎమ్‌బిసి-34, నూతన ఆర్‌టిసి బస్టాండ్, వైకుంఠం 1 మరియు 2, హెల్త్ ఆఫీసు, ఎటిసి, సుపథం, మేదరమిట్ట, వరాహస్వామి, రాంభగీఛ అతిధి గృహలవద్ద, శ్రీవారి ఆలయం లోపల, వాహనమండపం, కల్యాణకట్ట, బాలాజీ నగర్‌లో రెండు కేంద్రాలు, టిటిడి ఉద్యోగుల డిస్పెంన్సరి ఎస్.వి. హైస్కూల్, పాపావినాశనం చెంత పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయగా, అలిపిరి కాలిబాట చెంత ఒక్క మొబైల్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు జెఈవో తెలిపారు.
ఈ కార్యక్రమంలో అశ్విని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా|| నర్మద, కల్యాణకట్ట డిస్పెంన్సరి సూపరింటెండెంట్ డా|| కుసుమకుమారి, ఇతర అధికారులు, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.