ANANTALWAAR PIONEERED PUSHPA KAINKARYAM IN TIRUMALA-CVSO_ తిరుమలలో ఘనంగా పురశైవారితోటోత్సవం

Tirumala, 11 March 2018: Sri Anantalwar, the great disciple of Sri Ramanuja Charya pioneered Pushpakainkaryam in Tirumala and expressed his devotion towards Lord Venkateswara, said CVSO Sri A Ravikrishna.

The 964th Anantalwar Aradhanotsavam was held at Purasaivari Tota in Tirumala on Sunday.

The CVSO who took part in the spiritual fete said, Anantalwar stood as an example of an ardent disciple and devotee and hence remembered even after nine centuries of his demise.

SO Sri N Muktheswara Rao said, Anantalwar happens to own a rare relationship with Lord as a devotee who talked, played and even fought with Him.

Earlier Tirumala Sri Pedda Jiyar Swamy aand Sri Chinna Jiyar Swamy complimented the successors of Anantalwar for organising the fete from the past several decades sustaining the legacy.

Sri Perambadur Embar Jiyar, Kanchpuram Sri Manavala Jiyar, Vadakesari Sri Azagiya Jiyar swamy also graced the fete.

Meaanwhile 4000 decendants of Anantalwar clan presented. “Nalayira Divyaprabandha Gosthi Ganam”.

Alwar Divya Prabandha Project special officer Dr Chokkalingam, Sri Tatacharyulu – Anantalwar decendant and OSD P Seshadri were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమలలో ఘనంగా పురశైవారితోటోత్సవం

మార్చి 11, తిరుమల 2018: శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతళ్వారు 964వ అవతారోత్సవం తిరుమలలోని అనంతాళ్వార్‌తోటలో (పురశైవారితోట) ఆదివారంనాడు టిటిడి అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ సందర్బంగా సుమారు 4000 లకు పైగా అనంతళ్వారు వంశీకులు ”నాలాయిర దివ్యప్రబంధ గోష్ఠిగానం” నిర్వహించారు.

ఈ సందర్భంగా తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామిస్వామి అనుగ్రహషణం చేస్తు తన 102 ఏళ్ళ సుదీర్ఘ జీవన ప్రస్థానంలో స్వామివారికి పుష్పకైంకర్యాన్ని ప్రారంభించి ఉద్దరించిన శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు శ్రీ అనంతాళ్వార్‌ని కొనియాడారు. అనంతాళ్వారు వంశీకులుగతకొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం ముదావహం అన్నారు.

అనంతరం తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, శ్రీ పెరంబదూర్‌ శ్రీశ్రీశ్రీ యంబారుజీయర్‌స్వామి, కాంచిపురం శ్రీ మనవాల జీర్‌ శ్రీశ్రీశ్రీ వడికేశరి అళగియస్వామి (H.H.Vadikesari Azhagiya) ఆనంతాళ్వార్‌ జీవిత వైశిష్ట్యం గురించి అనుగ్రహభాషణం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన టిటిడి సివిఎస్వో శ్రీ ఆకే. రవికృష్ణ మాట్లాడుతూ 964 సంవత్సరాల క్రిందట శ్రీ రామానుజాచార్యులవారు స్వామి కైకర్యాని క్రమబద్దీకరించడానికి తన శిష్యుబృందంలో ఎవరైన ఉన్నారా అని అడిగినప్పుడు అనంతళ్వారు మందుకు వచ్చినట్లు తెలిపారు. ఆయన తిరుమలలో వివిధ రకాల సుగంధభరిత పుష్పాల మొక్కలతో కూడిన పుష్పాల తోటను ఏర్పరచి స్వామివారి పుష్పకైకర్యాన్ని ఉద్దరించి తన జీవితాన్ని భగవంతుని పాదాలవద్ద పుష్పంగా సమర్పించుకున్నారని వివరించారు. భావితరాలకు ఆయన తన నిబద్దతతో ఒక స్ఫూర్తిగా నిలిచారన్నారు.

టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీముక్తేశ్వరరావు మాట్లాడుతూ అనంతాళ్వార్‌ శ్రీవారితో మాట్లాడుతూ, ఆట్లాడుతూ, పొట్లాడుతూ నిత్య సన్నిహిత్య సంబంధం కలిగిఉన్నట్లు తెలిపారు. శ్రీ రామానుజ సహస్రాబ్ధి సందర్భంగా 4 వేల పాశురాలను సిడిలుగా తీసుకువచ్చినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ చొక్కలింగం, అనంతాళ్వార్‌ వంశీకులు శ్రీ తాతాచార్యులు, శ్రీవారి ఆలయం ఒఎస్‌డి శ్రీ పాలశేషాద్రి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.