TTD OPEN UP SEPARATE APP FOR SHOP AND RENTAL PAYMENTS_ తిరుమ‌ల‌లో దుకాణాల అద్దె చెల్లింపున‌కు ప్ర‌త్యేక అప్లికేష‌న్ : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

Tirupati, 19 Sep. 19: To enable the easy transaction, TTD has commenced a separate lease and rental management application which was brought into use for facilitating payments by shop keepers and hawkers in Tirumala from September 17 onwards, said EO Sri Anil Kumar Singhal.

The review meeting of the IT department was held in the chambers of TTD EO in administrative building in Tirupati on Thursday. He said henceforth all the 1340 shopkeepers and 617 hawkers in Tirumala could make online payment instead of visiting banks.

He asked the IT officials to streamline the Cottage Donors Management system for easy acceptance of donations and also sought devotees response on the online ticket sales of arjita sevas in TTD local temples.

He directed the officials to conceive an asset management system application for the supervision of hardware and software devices in all wings of TTD.

Similarly, the EO advised officials to develop an accommodation management system for Padmavathi Nilayam at Tiruchanoor and Pilgrims Amenities Complex at Vontimitta. Besides, he also asked them to develop a media management system to assess, TTD news appearing in various newspapers and channels.

He also reviewed on Kalyana mandapam, lockers system and darshan management applications.

He instructed the officials that the Srivari Seva Nextgen software application should be ready by October 10.

Tirumala Special Officer Sri AV Dharma Reddy, JEO Sri P Basant Kumar, CVSO Sri Gopinath Jatti, FACAO Sri O Balaji, Chief Engineer Sri Ramachandra Reddy, IT chief Sri Sesha Reddy, Estate officer Sri Vijay Saradhi and other officials participated.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల‌లో దుకాణాల అద్దె చెల్లింపున‌కు ప్ర‌త్యేక అప్లికేష‌న్ : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

సెప్టెంబర్ 19, తిరుపతి, 2019: తిరుమ‌ల‌లో దుకాణ‌దారులు ఆన్‌లైన్‌లో అద్దె చెల్లించేందుకు వీలుగా సెప్టెంబ‌రు 17వ తేదీ నుండి అమ‌ల్లోకి వ‌చ్చిన లీజ్ అండ్ రెంట‌ల్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ అప్లికేష‌న్‌పై టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ స‌మీక్షించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల కార్యాల‌యంలో గురువారం ఈవో ఐటి విభాగం అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌లో దుకాణ‌దారులు బ్యాంకుల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా ఆన్‌లైన్‌లో అద్దెలు చెల్లించేందుకు ఈ అప్లికేష‌న్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. కాటేజి డోనార్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ ద్వారా విరాళాలు స్వీక‌రించే విధానాన్ని ప‌రిశీలించారు. ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తున్న‌ స్థానికాల‌యాల ఆర్జిత‌సేవా టికెట్ల‌కు స్పంద‌న ఎలా ఉందో ప‌రిశీలించాల‌ని సూచించారు. టిటిడిలో విభాగాల వారీగా హార్డ్‌వేర్ ప‌రిక‌రాలు, సాఫ్‌వేర్ అప్లికేష‌న్ల వివ‌రాలు పొందుప‌రిచేందుకు అసెట్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ అప్లికేష‌న్‌ను రూపొందించాల‌న్నారు. తిరుచానూరులోని ప‌ద్మావ‌తి నిల‌యం, ఒంటిమిట్ట‌లోని యాత్రికుల వ‌స‌తి స‌ముదాయంలో గ‌దుల‌ను అన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు వీలుగా అప్లికేష‌న్ రూపొందించాల‌ని ఆదేశించారు. అక్టోబ‌రులో శ్రీ‌వారి సేవ నెక్ట్స్ జెన్ అప్లికేష‌న్‌ను పూర్తి చేయాల‌న్నారు. అదేవిధంగా, క‌ల్యాణ‌మండ‌ప‌మ్స్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్‌, ద‌ర్శ‌న్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్‌, లాక‌ర్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ అప్లికేష‌న్ల ప‌నితీరును ఈవో ప‌రిశీలించారు.

ఈ స‌మావేశంలో టిటిడి తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రామ‌చంద్రారెడ్డి, ఐటి విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి, ఎస్టేట్ అధికారి శ్రీ విజ‌య‌సార‌ధి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.