KAT AT SRIVARI TEMPLE ON SEP 24_ సెప్టెంబరు 24న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirumala, 19 Sep. 19: The TTD will be organizing the holy ritual of Koil Alwar Thirumanjanam at Srivari temple in Tirumala on September 24 ahead of the annual Brahmotsavams beginning on September 30.
This is a cleansing ritual, which is usually done four times in a year, including the Telugu New Year Ugadi, Anivara Asthanam, annual Brahmotsavams and Vaikunta Ekadasi.
The event will take place from 6.00 am to 11 am after morning rituals. The entire temple premises besides the puja materials, the walls, roof and gopuram will be cleaned with a special mixture called “Parimalam” and darshan will commence from 12 noons onwards.
TTD has cancelled the arjita sevas including Astadala Padapadmaradhana seva on Tuesday.
Details of Srivari Brahmotsava vahana sevas as follows:
30-09-2019 Dwajarohanam at 5.23 -6.00 pm in Meena Lagnam
And followed by Pedda Sesha Vahanam
01-10-2019 Chinna Sesha Vahanam. Hamsa Vahanam
02-10-2019 Simha vahanam Muthyapu pandiri
03-10-2019 Kalpavruksa Sarvabhoopala
04-10-2019 Mohini Garuda (7 pm-12 midnight)
05-10-2019 Hanumanta Swarnaratham Gaja Vahanam
06-10-2019 Suryaprabha Chandraprabha
07-10-2019 Rathotsavam Aswa vahanam
08-10-2019 Chakra snanam Dwaja Avarohanam
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సెప్టెంబరు 24న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల, 2019 సెప్టెంబరు 18: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారికి సెప్టెంబరు 30 నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు జరుగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబరు 24వ తేదీ మంగళవారం నాడు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు.
సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఉదయం 3.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, శుధ్ధి నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను మధ్యాహ్నం 12.00 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.
సెప్టెంబరు 24వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని పురస్కరించుకుని అష్టదళ పాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది.
శ్రీవారి వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం రాత్రి
30-09-2019 ————- ధ్వజారోహణం(సా..5.23 నుండి 6 గం. మధ్య), (మీన లగ్నం),
పెద్దశేషవాహనం
01-10-2019 చిన్నశేష వాహనం హంస వాహనం
02-10-2019 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
03-10-2019 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
04-10-2019 మోహినీ అవతారం గరుడ వాహనం (రా.7 నుండి 12 వరకు)
05-10-2019 హనుమంత వాహనం స్వర్ణరథం (సా.4 నుండి 6 వరకు), గజవాహనం.
06-10-2019 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
07-10-2019 రథోత్సవం (ఉ.7.00 గంటలకు) అశ్వ వాహనం
08-10-2019 చక్రస్నానం ధ్వజావరోహణం
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.