GIVE WIDE PUBLICITY FOR TTD PROGRAMS- TTD CHAIRMAN_ టిటిడి కార్యక్రమాలకు మరింత విస్తృత ప్రచారం : టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి.

Tirupati, 19 Sep. 19: TTD Trust Board Chairman Sri YV Subba Reddy directed officials to give adequate publicity for the elaborate arrangements made by TTD to devotees for the ensuing annual Brahmotsavams at Tirumala.

After viewing the promos made by the SVBC for Brahmotsavams on Thursday evening at Padmavathi Rest House in Tirupati along with TTD EO Sri Anil Kumar Singhal, JEO Sri P Basant Kumar and SVBC Chairman Sri Pruthviraj Bali Reddy, the chairman lauded SVBC on wonderful promos which included Swamivari sevas, daily rituals, Anna Prasadam, accommodation, TTDs facilitation Of elders, physically challenged, parents with infants, clean drinking water, ban on plastics, vahana sevas etc.

The chairman also suggested that the SVBC promos should be telecast in all media channels in various languages.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి కార్యక్రమాలకు మరింత విస్తృత ప్రచారం : టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి.

సెప్టెంబర్ 19, తిరుపతి, 2019: శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టిటిడి కల్పిస్తున్న సౌకర్యాలపై మరింత విస్తృత ప్రచారం కల్పించాలని టిటిడి ఛైర్మెన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను కోరారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎస్వీబీసీ రూపొందించిన ప్రొమోలను గురువారం సాయంత్రం తిరుపతి శ్రీపద్మావతి అతిథిగృహం సమావేశ మందిరంలో టిటిడి ఈవో శ్రీ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీ పృథ్వీరాజ్ బాలిరెడ్డితో కలసి తిలకించారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 8 వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి వాహన సేవల విశిష్టత తెలియజేస్తూ రూపొందించిన ప్రొమోలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. స్వామివారి సేవలు , నిత్యకైంకర్యాలు , అన్నప్రసాదాలు , వసతి , వృద్ధులు, దివ్యాంగులు , పసిపిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్లాస్టిక్ వాడకం నిషేధం, జలప్రసాదం తదితర కార్యక్రమాలపై రూపొందించిన ప్రొమోలను తిలకించారు. టిటిడి కార్యక్రమాలను ఎస్వీబీసీ తో పాటు ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా అన్ని బాషలలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.