EO REVIEWS ON TIRUMALA TEMPLE _ తిరుమల శ్రీవారి ఆలయంపై ఈవో సమీక్ష
TIRUMALA, 24 JUNE 2024: As a part of his departmental review meetings, TTD EO Sri J Syamala Rao reviewed in detail on Tirumala temple, its history, its architecture, significance and many other relevant features.
The review meeting was held at Gokulam Rest House in Tirumala on Monday evening wherein JEOs Smt Goutami and Sri Veerabrahmam were also present.
In the PowerPoint presentation, the EO viewed in detail the magnificent history of Tirumala temple, Vaikhanasa Agama, Jeeyangar System, various rituals, daily, weekly, monthly and annual sevas, different kainkaryams performed to Sri Venkateswara Swamy on a day from Suprabhatam to Ekantam in detail.
Later he also reviewed the different types of darshan including morning sevas, VIP darshan, general darshan, arjita sevas and many more.
He asked the temple DyEO Sri Lokanatham to send him everyday time consumption details to each format of darshan in detail for better understanding.
Inspection:
Earlier during the day, EO inspected Narayanagiri sheds along with engineering officials and gave them some valuable suggestions on how to manage the pilgrim crowd in an effective manner.
In the inspection along with the two JEOs, CVSO Sri Narasimha Kishore, CE Sri Nageswara Rao, SE2 Sri Jagadeeshwar Reddy and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమల శ్రీవారి ఆలయంపై ఈవో సమీక్ష
తిరుమల, 2024 జూన్ 24: తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయం, చరిత్ర, వాస్తుశిల్పం, విశిష్టత మరియు అనేక ఇతర సంబంధిత విశేషాలపై టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు సవివరంగా సమీక్షించారు.
సోమవారం సాయంత్రం తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో జరిగిన సమీక్షా సమావేశంలో జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తిరుమల శ్రీవారి ఆలయ చరిత్ర, వైఖానస ఆగమ, జీయంగార్ వ్యవస్థ, వివిధ ఆచార వ్యవహారాలు, నిత్య, వార, మాస, వార్షిక సేవా కార్యక్రమాలు, సుప్రభాతం నుంచి ఏకాంతం వరకు ప్రతిరోజు శ్రీవేంకటేశ్వర స్వామికి నిర్వహించే వివిధ కైంకర్యాలను సవివరంగా ఈవోకు వివరించారు.
తరువాత ఆయన ఉదయం సేవలు, విఐపి దర్శనం, సర్వ దర్శనం, ఆర్జిత సేవలు, ఇతర దర్శనాలను కూడా సమీక్షించారు.
భక్తులకు కల్పిస్తున్న వివిధ రకాల దర్శనాలు, ఇందుకు సంబంధించిన దర్శన సమయము, ఏ దర్శనానికి ఎంత సమయం పడుతోంది తదితర అంశాలపై సవివరంగా తనకు నివేదిక పంపవలసిందిగా ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంను ఆయన ఆదేశించారు.
ఈవో తనిఖీలు:
అంతకుముందు ఇంజినీరింగ్ అధికారులతో కలిసి నారాయణగిరి షెడ్లను ఈఓ పరిశీలించారు. యాత్రికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడం గురించి కొన్ని విలువైన సూచనలు ఇచ్చారు.
ఈ తనిఖీలో ఇద్దరు జేఈవోలతో పాటు సీవీఎస్‌వో శ్రీ నరసింహకిషోర్, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఈ -2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.