KARTHIKA VANABHOJANAM OBSERVED_ శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కార్తీక వనభోజనాలు

Tirupati, December 4, 2018 : The holy event of Karthika Vana Bhojanam at Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram was observed with religious pomp and gaiety on Tuesday.

The Paruveta Mandalam was decked up with Shamianas, electrical and floral decorations besides queue lines for benefit of the devotees. Special devotional and bhakti programs also conducted during the occasion.

As part of the event, the procession of Lord with His consorts Sridevi and Bhudevi commenced from temple at 8.00 AM and reached the Paruveta mandapam near Srivari mettu by 9.30 AM where Tirumanjanam was performed for the utsava idols and was followed by Asthanam from 10.00 AM onwrds.

The devotees gathered in huge numbers and were served with delicious and tasty food as a part of vana bhojanam after the cultural programs.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కార్తీక వనభోజనాలు

తిరుపతి, 2018 డిసెంబరు 04: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం కార్తీకవనభోజనాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం 8.00 నుండి 9.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లు ఊరేగింపుగా ఆలయం నుండి శ్రీవారి మెట్టు మార్గంలోని పార్యేట మండసానికి చేరుకున్నారు. ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు పార్వేట మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం నిర్వహించారు. ఆనంతరం ఆస్థానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా టిటిడి ఏర్పాటు చేసిన వనభోజనంలో వివిధ రకాల రుచికరమైన వంటకాలను భక్తులకు వడ్డించారు. శ్రీవారి వనభోజనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

అనంతరం మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పార్వేట మండపం నుండి ఆలయానికి ఊరేగింపుగా చేరుకున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు, ఏఈవో శ్రీ ల‌క్ష్మ‌య్య‌, సూప‌రింటెండెంట్ శ్రీ ర‌మ‌ణ‌య్య‌, శ్రీ ముని చెంగ‌ల్రాయులు, అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.