TIRUPPAVAI PASURA PARAYANAM COMMENCES IN PEDDA JEEYAR MUTT  _ పెద్దజీయర్ మ‌ఠంలో తిరుప్పావై పారాయ‌ణం

TIRUPPAVAI REPLACES SUPRABHATAM IN TIRUMALA TEMPLE 

Tirumala, 17 December 2022: As the auspicious month of Dhanurmasam has commenced on December 16 at 6.12pm Andal Sri Godai Tiruppavai replaced Suprabhatam in Tirumala temple on Saturday.

All the Sri Vaishnavaite temples follow the recitation of Tiruppavai hymns during the entire Dhanurmasa.

TIRUPPAVAI PASURA PARAYANAM COMMENCES IN PEDDA JEEYAR MUTT 

In connection with the auspicious Dhanurmasam, the Tiruppavi Pasura Parayanam commenced in Sri Pedda Jeeyar Mutt on Saturday in Tirumala.

This religious event took place in the presence of HH Sri Sri Sri Periyakovil Kelviyappan Sriman Sri Shatagopa Ramanuja Periya Jeeyar Swamy and HH Sri Sri Sri Seriya kovil kelviyppan Sriman Sri Govinda Ramanuja Chinna Jeeyar Swamy of Tirumala. This spiritual programme is being telecasted live by SVBC everyday between 7am and 8am for the sake of global devotees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

– ధనుర్మాసం ప్రారంభం

– పెద్దజీయర్ మ‌ఠంలో తిరుప్పావై పారాయ‌ణం

తిరుమల, 2022 డిసెంబరు 17: ధనుర్మాసం ప్రారంభం కావడంతో తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదించారు. జనవరి 14వ తేదీ వరకు తిరుప్పావై పారాయణం కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభమయ్యాయి.

ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం…

పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

ఆండాళ్‌ తిరుప్పావై పారాయణం…

12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.

పెద్దజీయర్ మ‌ఠంలో తిరుప్పావై పారాయ‌ణం ప్రారంభం

పవిత్ర ధనుర్మాసం సంద‌ర్భంగా పెద్దజీయర్ మ‌ఠంలో తిరుప్పావై పారాయ‌ణం శనివారం ప్రారంభమైంది. ఉద‌యం 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. జ‌న‌వ‌రి 14వ తేదీ వ‌ర‌కు నెల రోజుల పాటు తిరుప్పావై పాశురాల‌ను పారాయ‌ణం చేస్తారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.