FASCINATING CULTURAL FETE @ HANUMANTHA VAHANAM_ హనుమంత వాహనసేవలో కళాబృందాల కోలాహలం
Tirumala, 28 September 2017: The pilgrims at mada streets witnessed the Hanumantha vahanam were privy to a feast of Sri Rama Bhajans, bhakti dances, Kolatam, Chakka bhajanas by artists of HDPP, Dasa Sahitya, Annamacharya Project and SV College of Music and Dance.
The exotic darshan of Malayappaswamy in Sri Ramachandra Murthy Avatar on Hanumantha Vahanam and the spectacle of colourful dances, bhajans and bhakti culture was a thrilling experience’ says Panduranga Rao, a pilgrim from Vijayawada who came with a family of four and spent almost five hours on the mada streets enjoying the cultural feast.
The Sita, Rama, Lakhmana, Bharata and Shatrugna roles besides Hanuman donned by the artistes enthralled the devotees. The white masked Drum beaters were another attraction on the mada streets.
The women Kolatam team, Sri Rama bhajan mandali of Rajamandry also enthralled the devotees with their Chakka bhajans and sankeertans.
,
The Tappeta gullu of Vijiyanagaram and drums of Sri M G Karthikar of Osmanabad were other major attractions.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI
హనుమంత వాహనసేవలో కళాబృందాల కోలాహలం
సెప్టెంబర్ 28, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఉదయం హనుమంత వాహనంపై శ్రీరాముని అవతారంలో శ్రీ మలయప్పస్వామివారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఆనందడోలికల్లో ముంచెత్తాయి.
శ్రీరామభజన, నృత్యం :
రాజమండ్రికి చెందిన శ్రీమతి హేమలత ఆధ్వర్యంలో శ్రీ గరుడాద్రివాసా భజన మండలి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన శ్రీ శివరామకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ మారుతి నాసిక్ డోలు బృందం కళాకారులు శ్రీరామ భజన, నృత్యం భక్తులను ఆకట్టుకున్నాయి. సీతారామలక్ష్మణ భరత శత్రజ్ఞుల వేషాలు ధరించిన కళాకారులు మధ్యలో నిలిచి ఉండగా, హనుమంతుని వేషధారణలో పలువురు కళాకారులు భజన కీర్తనలు పాడుతూ నృత్యం చేశారు. అలాగే, ముఖానికి మాస్కులు ధరించి డోలు వాయించడం భక్తులను అలరించింది.
ఉత్సాహంగా మహిళల కోలాటం :
వాహనసేవలో పలువురు మహిళామణులు ఉత్సాహంగా కోలాటంలో పాల్గొన్నారు. విశాఖపట్నంలోని పరవాడకు చెందిన శ్రీ దుర్గామాంబ మహిళా కోలాట సమితి, విశాఖలోని శ్రీరామవేంకటేశ్వర ఆధ్యాత్మిక సేవా సంఘం, విశాఖలోని దేశపాత్రునిపాళేనికి చెందిన వేంకటపోలమాంబ అన్నమయ్య పదసంఘం, శ్రీకాకుళానికి చెందిన శ్రీ వాసవి వేంకటఅన్నమయ్య పద సంస్థానం, టిటిడి మహిళా ఉద్యోగులు కోలాట ప్రదర్శన ఇచ్చారు. ఇందులో పలు భక్తి కీర్తనలకు కళాకారులు చక్కగా అడుగులు వేస్తూ కోలాటం ఆడారు.
చెక్క భజనతో భక్తిభావం :
కళాకారులు చేసిన చెక్క భజనలు భక్తులకు భక్తిభావాన్ని పంచాయి. రాజమండ్రికి చెందిన శ్రీ కాత్యాయని భజనమండలి, శ్రీ దిగ్విజయరామ భజనమండలి, గజపతినగరానికి చెందిన శ్రీవెంకటపద్మావతి అన్నమయ్య భజన మండలి, మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీ వేంకటేశ్వర భజన మండలి, రాజమండ్రిలోని మల్లేపల్లికి చెందిన శ్రీ రమాసత్య భజనమండలి చక్కగా భజనలు చేశారు. పలు భక్తిసంకీర్తనలు ఆలపిస్తూ భజనలు చేయడంతో భక్తులు కూడా గళం కలిపారు.
అదేవిధంగా, విజయనగరం కళకారుల తప్పెటగుళ్లు, మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు చెందిన శ్రీ ఎం.జి.కార్తికర్ డ్రమ్స్ ఆకట్టుకున్నాయి.
కాగా, నల్గొండ జిల్లా కోదాడకు చెందిన శ్రీ జొన్నలగడ్డ వెంకటరమణ పలురకాల వేషధారణలో వాహనసేవల్లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు నరసింహ, ఆంజనేయ, గరుడ, తాటకి రాక్షసి వేషాలను ధరించారు. ఈయన తండ్రి శ్రీ జొన్నలగడ్డ భిక్షమయ్య 30 ఏళ్ల పాటు బ్రహ్మూెత్సవాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు బ్రహ్మూెత్సవాల్లో వివిధ వేషధారణలతో ఆకట్టుకుంటున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.