LORD MALAYAPPA AS “VENKATADRI SRI RAMACHANDRA MURTHY” TAKES RIDE ON LORD HANUMAN_ హనుమంతునిపై వేంకటాద్రిరాముడు

Tirumala, 28 September 2017: The processional deity of Lord Malayappa Swamy in the guise of Venkatadri Sri Ramachandra Murthy was taken out in procession atop Lord Hanumantha Vahanam in Tirumala on the sixth day morning as a part of nine day brahmotsavams.

Hanumantha Vahanam Significance: Lord Hanuman is known for total Saranagathi or total surrenderness before his Master Lord Sri Rama by performing the duties as a disciplined soldier without deferring the orders. Hanuman is believed to be incarnationof Lord Siva.

MANGAMBUDI HANUMANTA..

Noticing the mightiness of Lord Hanuman which enhanced when he carried Lord Malayappa Swamy, and glided along four mada streets, Annamacharya penned the famous sankeertan, Mangambudi Hanumanta..nee sharana” which spells the divine magic on the hearts of devotees.

DEVOTEES GETS SIVA-VAISHNAVA DARSHAN

Another interesting feature is while all other carriers are noble servants of Lord, it is only Hanuman who holds the credit being worshipped as a Lord. So Lord Malayappa takes ride on Lord Hanuman. In this manner the devotees get the double dhamaka darshan of both Lord Vishnu and Lord Siva in the form of Lord Malayappa as Venkatadri Sri Rama and Lord Hanuman. After Garuda, Lord Malayappa takes a ride on Hanumantha Vahanam to show the devotees the true meaning of “Sampurna Sharanagathi”.

TTD EO Sri Anil Kumar Singhal, JEOs Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, CVSO Sri Ake Ravikrishna, Temple DyEO Sri Rama Rao and others took part.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

హనుమంతునిపై వేంకటాద్రిరాముడు

తిరుమల, 28 సెప్టెంబరు 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన గురువారం ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి

భక్తులకు దర్శనమిచ్చాడు. ఈ సందర్భంగా స్వామివారికి సాలగ్రామాలహారం ధరింపచేశారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల

నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీవేంకటేశ్వరుణ్ణి శ్రీరాముడిగా భావించి, శ్రీవారిసుప్రభాతాన్ని రచించిన శ్రీహస్తిగిరినాథన్‌ ”కౌసల్యా సుప్రజా రామ! ” అంటూ స్తుతించారు. రామాయణంలోని శ్రీరాముడే ద్వాపరంలో శ్రీకృష్ణుడు. ఆ

శ్రీకృష్ణుడే ఈ యుగంలో వేంకటేశ్వరుడు. కనుక స్వామి వేంకటరాముడు, వేంకటకృష్ణుడు, వేంకటాచలపతి – ఇలా త్రివేణీసంగమయిన సేవ – హనుమద్వాహనసేవ.

దాస్యభక్తుల్లో హనుమంతుడు పేరెన్నికగన్నవాడు. వేదాలూ, వ్యాకరణాలూ సమస్తమూ క్షుణ్ణంగా తెలిసినవాడు. హనుమంతుణ్ణిసేవిస్తే, రోజూ భక్తితో దర్శిస్తే, భక్తులకు బుద్ధి, బలం, యశస్సు,

ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, చైతన్యం, మంచి వాక్‌శక్తి సిద్ధిస్తాయి. అందుకే హనుమంతుడు భక్తులతో ”మీకు కావలసిన భౌతిక, ఆధ్యాత్మిక, ధార్మిక ఫలాలన్నీ నేనే ఇస్తా. మోక్షంమాత్రం నాస్వామి రామయ్యనే

సేవించి పొందండి” అన్నాడు. కనుక ఈనాటి వాహనంగాఉన్న హనుమంతుని దర్శనంతో బుద్ధిబలం మొదలైనవన్నీ లభిస్తాయి. హనుమంతునిపైనున్న శ్రీవారిని దర్శించడంతో ఇహమేకాక పరమమైన

మోక్షంకూడా లభిస్తుంది.

ఈ హనుమంతవాహనోత్సవం – ప్రతివ్యక్తీ హనుమంతునివలె నిష్కళంక హృదయం, నిస్స్వార్థసేవా తత్పరత, ప్రభుభక్తి పరాయణత, సచ్ఛీలం మున్నగు సుగుణ సంపత్తి కల్గిఉంటే భగవంతునికి

మిక్కిలి సన్నిహితులై, స్వామి కృపకు సర్వదా పాత్రుడవుతాడు. హనుమంతుడు రాబోయే కల్పంలో బ్రహ్మ అవుతాడు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.