FIRST REVIEW MEETING ON TWIN BRAHMOTSAVAMS HELD BY TTD EO _ అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

SALAKATLA BRAHMOTSAVAMS FROM SEPT.18 TO 26

NAVARATRI BRAHMOTSAVAMS FROM OCT.15-23

PURATASI MONTH FROM SEPT.18 TO OCT.17

EO ASKS ALL DEPARTMENTS TO GEAR UP FOR THE BIG FESTIVAL

TIRUMALA, 31 JULY 2023: As twin Brahmotsavams are lined up this year in the successive months of September and October due to Adhikamasam, TTD EO Sri AV Dharma Reddy held the first review meeting with all the departments of TTD along with JEO Smt Sada Bhargavi and Sri Veerabrahmam at Annamaiah Bhavan in Tirumala on Monday.

Later addressing media persons, the EO said, the Salakatla Brahmotsavams are scheduled between September 18-26 and the Navaratri Brahmotsavams from October 15 to 23 this year. “We commenced our arrangements one and a half months in advance. After a fortnight’s time, a review meeting with district administration will also be conducted”, he maintained.

Briefing on the important points discussed during the review meeting, the EO said, the important days in annual brahmotsavams includes Dhwajarohanam on September 18 and on the same day, the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy will present silk vastams to Sri Venkateswara Swamy on behalf of the State Government. The other important days include Garuda Seva on 22, Golden Chariot on 23, Rathotsavam on 25, Chakrasnanam and Dhwajavarohanam on 26 with which the annual fete concludes.

Similarly, the Navaratri Brahmotsavams will commence on October 15 followed by Garuda Vahanam on 19, Pushpaka Vimanam on 20, Golden Chariot on 22 and concludes with Chakra Snanam on 23.

The EO said a detailed review meeting on engineering works, Annaprasadam, Darshan and Accommodation, Security arrangements of TTD Vigilance and Security wing in co-ordination with Police, Kalyanakatta, Transport, HDPP, Garden, Medical, Health, Paraphernalia, Srivari Sevaks etc. were discussed. After 15 days another meeting involving district administration will be held”, he added.

As the Purattasi month coincides with both the brahmotsavams, heavy pilgrim rush is being anticipated this year. The holy month commences on September 18 and concludes on October 17. The Purattasi Saturdays occur on September 23, 30 and October 7, 14. So the officials concerned are directed to plan accordingly ensuring hassle free darshan to devotees during these two brahmotsavams and Purattasi Saturdays.

DLO Sri Veeraraju, FACAO Sri Balaji, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, HoDs of various departments, Additional SP Tirumala Sri Muniramaiah, police and others were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

– సెప్టెంబరు 18 నుండి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు


-అక్టోబర్ 15 నుండి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు

– పురటాసి మాసం సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 17 వరకు

– భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు

– టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, 31 జూలై 2023: అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో, పురటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి చెప్పారు . అన్నివిభాగాల అధికారులు జిల్లాయంత్రాంగం తో సమన్వయం చేసుకుని

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మంలతో కలిసి టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ, సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఒకటిన్నర నెల ముందుగానే ప్రారంభించినట్లు చెప్పారు. 15 రోజుల తరువాత, జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు.

వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన రోజుల్లో సెప్టెంబర్ 18న ధ్వజారోహణం ఉంటుందని, అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ముఖ్యమైన రోజుల్లో 22న గరుడ సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు.

అదేవిధంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15న ప్రారంభమై 19న గరుడవాహనం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానంతో వస్తాయని చెప్పారు.

ఇంజినీరింగ్ పనులు, అన్నప్రసాదం, దర్శనం, వసతి, పోలీసు, కళ్యాణకట్ట, రవాణా, హెచ్‌డిపిపి, ఉద్యానవనం, వైద్యం, ఆరోగ్యం, శ్రీవారి సేవకుల సమన్వయంతో టీటీడీ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగం భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించినట్లు ఈవో తెలిపారు.

పురటాసి మాసం, రెండు బ్రహ్మోత్సవాలు కలిసినందున, ఈ సంవత్సరం భారీ యాత్రికుల రద్దీని అంచనా వేస్తున్నామని ఈవో చెప్పారు . పురటాసి పవిత్ర మాసం సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తుందన్నారు. సెప్టెంబరు 23, 30, అక్టోబర్ 7, 14 తేదీల్లో పురటాసి శనివారాలు జరుగుతాయని, ఈ రెండు బ్రహ్మోత్సవాలు , పురటాసి శనివారాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించామని తెలిపారు.

ఎఫ్ ఎ సిఎవో శ్రీబాలాజి , డిఎల్వో శ్రీ వీర్రాజు, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ 2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, అదనపు ఎస్పీ శ్రీమునిరామయ్య , ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, వివిధ శాఖాధిపతులు, తిరుమల పోలీసు అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడింది