FIVE MORE SWORN IN _ ప్రమాణ స్వీకారం చేసిన ఐదుగురు ధర్మకర్తల మండలి సభ్యులు
TIRUMALA, 08 NOVEMBER 2024: Five more sworn in as TTD Trust Board members on Friday in Tirumala temple.
TTD Additional EO Sri Ch Venkaiah Chowdary administered the oath in front of Sri Venkateswara Swamy at Bangaru Vakili.
The members included Sri Vaidyanathan Krishnamurthy, Sri Sourabh Bora, Smt Panabaka Lakshmi, Sri Sadasiva Rao, Sri Jyothula Nehru.
After the darshan of Srivaru, the members were rendered Vedaseervachanam at Ranganayakula Mandapam followed by the presentation of Thirtha Prasadams, lamination photo of Srivaru, TTD Calendars and Diaries.
DyEOs Sri Lokanatham, Sri Bhaskar, VGOs Sri Surendra, Sri Ramkumar and others were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ప్రమాణ స్వీకారం చేసిన ఐదుగురు ధర్మకర్తల మండలి సభ్యులు
తిరుమల, 2024 నవంబరు 08: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శుక్రవారం ఉదయం ఐదుగురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో శ్రీ వి.కృష్ణమూర్తి, శ్రీ సౌరభ్ బోరా, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ సదాశివరావు, శ్రీ జ్యోతుల నెహ్రు ఉన్నారు.
శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అడిషనల్ ఈవో అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ భాస్కర్, వీజీవోలు సురేంద్ర , రామ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.