TEPPOTSAVAM BEGINS AT SRI PAT_ వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభం

Tiruchanoor, 13 Jun. 19: On Thursday evening as part of the annual Teppotsavam of Sri Padmavathi ammavari temple, Tiruchanoor, Sri Krishna Swamy accompanied by Consorts Sri Rukmini and Sri Sathyabama went round the Padma Pushkarani three times on the colourfully decorated float.

As part of the float festival, special abhisekam was performed to Goddess Padmavathi after daily rituals and the deity was grandly paraded on the mada streets in the evening.

Speaking on the occasion the TTD JEO B Lakshikantham said tomorrow, June 14 Sri Govindaraja Swamy would adorn the floats three rounds and on June 15 Goddess Padmavathi would Bless the devotees on June 16, 17 also by taking five and seven rounds on the colourful float in the Padma Pushkarani.

A snapana thirumanjanam will be performed of Goddess Padmavathi on last three days of the float festival. On June 16 evening the Goddess will bless the devotees on Gaja vahanam and Garuda vahanam on June 17 and devotees should participate in large numbers and beget her blessings, said the JEO.

Temple DyEO Smt Jhansi Rani, AVSO Sri Nandeeswar Rao, AEO Sri Subramanyam and other officials participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2019 జూన్ 13: సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామివారు పద్మసరోవరంలో తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.00 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీ కృష్ణస్వామివారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులోభాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంద్ర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 6.30 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ కృష్ణస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ అమ్మవారి తెప్పొత్సవాలు వైభవంగా ప్రారంభమయినట్లు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు కనువిందు చేశారన్నారు. అదేవిధంగా జూన్ 14న శ్రీసుందరరాజస్వామి 3 ప్రదక్షిణలు, జూన్ 15న శ్రీపద్మావతి అమ్మవారు 3 ప్రదక్షిణలు, జూన్ 16న శ్రీపద్మావతి అమ్మవారు 5 ప్రదక్షిణలు, జూన్ 17న శ్రీపద్మావతి అమ్మవారు 7 ప్రదక్షిణలు తెప్పలపై విహరిస్తారని తెలిపారు.

ఈ సందర్భంగా చివరి మూడు రోజులు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3.30 గంటలకు అమ్మవారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలియచేశారు. జూన్ 16వ తేదీ రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహనంపై, జూన్ 17న గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. భక్తులు పెద్దసంఖ్యలో తెప్పొత్సవాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, ఏవీఎస్వో శ్రీ నందీశ్వర్ రావు , ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.