FLOAT FESTIVAL OF SRI VENUGOPALA SWAMY WITH SRI RUKMINI AND SRI SATYABHAMA _ తెప్ప‌పై శ్రీ రుక్మిణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ వేణుగోపాల‌స్వామి విహారం

Tirupati, 07 August 2025: As part of the annual float festival of Sri Venugopala Swamy at Karvetinagaram, on the second day on Thursday, the deity along with His consorts Sri Rukmini and Sri Satyabhama, were taken in a grand procession on the temple float to bless the devotees.

Special rituals were conducted in the temple on this occasion.

The event was attended by Temple AEO Sri Ravi, Superintendent Sri Muni Shankar, other officials, and a large number of devotees.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

తెప్ప‌పై  శ్రీ రుక్మిణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ వేణుగోపాల‌స్వామి విహారం

తిరుపతి, 2025 ఆగ‌స్టు 07: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్స‌వాలలో భాగంగా రెండ‌వ రోజైన గురువారం స్వామివారు తెప్ప‌పై  భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉద‌యం 9.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం జ‌రిగింది. ఇందులో పాలు, పెరుగు, తెనే, ప‌సుపు, చంద‌నంల‌తో అభిషేకం చేశారు. అనంత‌రం సాయంత్రం 5 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్స‌వం నిర్వ‌హించారు.

సాయంత్రం 6.30 గంటలకు శ్రీ రుక్మిణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ వేణుగోపాల‌స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై 7 చుట్లు విహరించి భక్తులకు అభయమిచ్చారు.

ఆగష్టు 08న శుక్రవారం రాత్రి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి 09 రౌండ్లు తెప్పలపై విహరించి భక్తులను ఆశీర్వదిస్తారు.  

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ర‌వి, సూపరింటెండెంట్‌ శ్రీ ముని శంక‌ర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ సురేష్ కుమార్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.