FLORAL TRIBUTES TO ADIBATLA NARAYANA DAS STATUE_ శ్రీ ఆదిభట్ట నారాయణదాస విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

Tirupati, 29 Aug. 19: TTD today grandly organised 155thJayanti Of pitamah Of Harikatha Sri Mafajjada Adibatla Narayana Das.

The statue of the harikatha exponent at the SV Music and Dance College premises was profusely garlanded by College principal Smt YVS Padmavathi. Later students of the College presented ground songs. Head of Harikatha wing Sri Simhachala Shastri, faculty members and students participated in the event.

Later in the evening under the aegis of SVM and D College at the Mahanti auditorium, Dr. G Devarajulu will present a documentary on Life story of Adibatla and the team of Smt M Purna, Bhagavatakaruni Of Tirupati will present Sita Kalyanam, harikatha ganam.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ ఆదిభట్ట నారాయణదాస విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

తిరుపతి, 2019 ఆగ‌స్టు 29: హరికథా పితామహునిగా వినుతికెక్కిన శ్రీమదజ్జాడ ఆదిభట్ట నారాయణదాస 155వ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని టిటిడి శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలో ఆయన విగ్రహానికి గురువారం ఉదయం కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి వైవిఎస్‌.పద్మావతి ఘనంగా పుష్పాంజలి సమర్పించారు. ఆనంతరం కళాశాల విద్యార్థులు బృందగానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరికథా విభాగాధిప‌తి శ్రీ సింహాచ‌ల‌శాస్త్రీ, అధ్యాపకులు శ్రీ వేంకటేశ్వర్లు, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కాగా సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన డా.. జి.దేవ‌రాజులు ”ఆదిభట్లవారి జీవిత విశేషాలు” అనే అంశంపై పత్ర సమర్పణ చేస్తారు. ఆ తరువాత తిరుపతికి చెందిన శ్రీమతి ఎం.పూర్ణ భాగ‌వ‌తారిణి బృందం ”సీతా క‌ల్యాణం” హరికథా గానం చేయ‌నున్నారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఈ ఉత్సవాలను ఘనంగా జ‌రుగ‌నుంది.

నారాయణదాసవర్యులు 1864, ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో శ్రీలక్ష్మీనరసమాంబ, వేంకటచయన దంపతులకు జన్మించారు. సంగీత, సాహిత్యాల్లో బాల్యం నుంచే ఈయన అద్భుతమైన ప్రతిభాపాఠవాలు ప్రదర్శించేవారు. పోతన భాగవత పద్యాలు, ఇతర శతక పద్యాలను ఐదేళ్ల ప్రాయంలోనే అవలీలగా వల్లించేవారు. ఉపమాన ఉపమేయాలను పోషించండంలో నారాయణదాసవర్యులు కాళిదాస మహాకవికి సమానమైనవారు. వీరు రచించిన హరికథా రచనలు, సాహిత్యగ్రంథాలు, సంగీతరూపకాలు కవి, గాయక, పండితులకు మనోజ్ఞమైన ఆనందాన్ని కలిగించాయి. ఈయన రచించిన సావిత్రిచరిత్ర, జానకీశపథం, భక్తమార్కండేయ చరిత్ర, రుక్మిణీ కల్యాణం హరికథా వాఙ్మయంలో నాలుగు వేదాలు లాంటివి. ఏకకాలంలో ఐదు విధాల లయలను ప్రదర్శించడం ఈయనకే సాటి. ఈయనకు పంచముఖేశ్వర అనే బిరుదు ఉంది. సంగీత, సాహిత్యాలను సరితూచిన త్రాసు నారాయణదాసు అని తిరుపతి వేంకటకవులు, శ్రీశ్రీ లాంటి మహానుభావులు కొనియాడారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.