AMAVASYA FESTIVITIES AT SRI KRT ON AUG 30_ ఆగస్టు 30న అమావాస్యనాడు శ్రీకోదండరామాలయంలో సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ
Tirupati, 29 Aug. 19: TTD plans to organise Sahasra Kalashabisekam and Hanumanta Vahanam on August 30, Amavasya at the TTDs local temple of Sri Kodandaramaswami temple.
Later in the evening, Hanumanta vahanam Seva will be conducted.
Interested devotees could participate in the abhisekam with a ticket of Rs. 500 and beget uttarium, blouse, Laddu, vada as Prasadam.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 30న అమావాస్యనాడు శ్రీకోదండరామాలయంలో సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ
తిరుపతి, 2019 ఆగస్టు 29: తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో ఆగస్టు 30వ తేదీ శుక్రవారం అమావాస్యనాడు సహస్రకలశాభిషేకం, హనుమంత వాహనసేవ వైభవంగా జరుగనున్నాయి.
ఇందులో భాగంగా ఉదయం 6.30 నుండి 8.00 గంటల నడుమ సహస్ర కలశాభిషేకంసేవ వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.
సాయంత్రం 7.00 నుంచి రాత్రి 9.00 గంటల నడుమ హనుమంత వాహనసేవ జరుగనుంది. హనుమంతుడిని ‘సంకట మోచన’గా పిలుస్తారు. అనగా దుష్టశక్తులను నశింపజేసి చెడు ఆలోచనలను దూరం చేస్తాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రం తదితర పర్వదినాలకు చాలా విశిష్టత ఉంటుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.