FOCUS ON BRINGING EPICS FOR CHILDREN- TTD EO _ పిల్ల‌ల‌కు అర్థ‌మ‌య్యేలా పురాణ ఇతిహాసాల‌ను ప్ర‌చురించండి : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

VSIHNU, MATSYA AND BRAHMA MAHA PURANAS RELEASED

 Tirupati, 28 January 2021: The Pundits and Scholars should focus on bringing the Epics for Children said TTD EO Dr KS Jawahar Reddy.

After releasing the three Maha Purana Books including Vishnu, Matsya and Brahma Maha Puranas brought by Purana Itihasa Project of TTD which took place at Annamacharya Kalamandiram on Thursday evening, Dr Reddy felt the need that the great literature given by fore fathers should reach the next generation.

He sought the literary stalwarts, also to work on the epics keeping in view the children. The EO observed Purana Itihasa Project has an important role to play in the promotion of Hindu Sanatana Dharma by bringing great scriptures to common public through translation. He also complimented JEO H & E Smt Sada Bhargavi for taking a special interest in bringing out the books in stipulated time.

Later the scholars who translated Matsya Maha Puranam, Dr Samudrala Lakdhmaiah, Vishnu Maha Puranam, Dr K Satyanarayana, Brahma Maha Puranam First Part by Dr A Nagabhushanam (passed away recently) while Second Part by Dr B Lakshmanacharyulu shared their experience and complimented TTD mandarins for bringing out the ancient texts to the public fore.

Earlier the Project In-charge and Annamacharya Project Director Sri Dakshinamurthy Sharma briefed on Purana Ithihasa Project activities. He said a total of 3.8lakh shlokas are available in our scriptures and so far the Project has completed 3.55lakh shlokas and remaining will also be completed with the same enthusiasm and supported offered by TTD authorities soon.

HDPP Chief Sri Rajagopalan, DASA Sahitya Project Special Officer Dr Anandatheerthacharya, SVETA Director Sri Ramanjulu Reddy, literary luminaries and literature lovers of the Temple City were also present.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పిల్ల‌ల‌కు అర్థ‌మ‌య్యేలా పురాణ ఇతిహాసాల‌ను ప్ర‌చురించండి : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

విష్ణుమ‌హాపురాణం, బ్ర‌హ్మ‌మ‌హాపురాణం, మ‌త్స్యమ‌హాపురాణం గ్రంథాల‌ ఆవిష్కర‌ణ‌

తిరుప‌తి, 2021 జ‌న‌వ‌రి 28: భావిభార‌త పౌరులైన పిల్ల‌ల‌కు అర్థ‌మ‌య్యేలా పురాణ ఇతిహాస గ్రంథాల‌ను ప్ర‌చురించ‌డంపై పండితులు దృష్టి సారించాల‌ని, త‌ద్వారా పిల్ల‌లు జీవితాంతం ఆధ్యాత్మిక‌ప‌థంలో న‌డిచేందుకు వీలుంటుంద‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఉద్ఘాటించారు. తిరుప‌తిలోని అన్న‌మాచార్య క‌ళామందిరంలో గురువారం సాయంత్రం టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ముద్రించిన విష్ణుమ‌హాపురాణం, బ్ర‌హ్మ‌మ‌హాపురాణం, మ‌త్స్యమ‌హాపురాణం గ్రంథాల‌ను ఈవో ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ పూర్వీకులు మ‌నకు అందించిన ఆధ్యాత్మిక సాహితీ సంప‌ద‌ను భవిష్య‌త్ త‌రాలకు అందించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు.  గొప్ప గ్రంథాల‌ను సంస్కృతం నుండి తెలుగులోకి అనువ‌దించి సామాన్య ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌డం ద్వారా పురాణ ఇతిహాస ప్రాజెక్టు స‌నాత‌న ధ‌ర్మ ప్ర‌చారంలో ముఖ్య పాత్ర‌ను పోషిస్తోంద‌న్నారు. అష్టాద‌శ పురాణ గ్రంథాల‌ను నిర్దేశిత స‌మ‌యంలో ప్ర‌చురించడంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హిస్తున్న జెఈవో(ఆరోగ్యం, విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌విని ఈవో అభినందించారు.

కాగా, మ‌త్స్యమ‌హాపురాణాన్ని డా. స‌ముద్రాల ల‌క్ష్మ‌ణ‌య్య, బ్ర‌హ్మమ‌హాపురాణం మొద‌టి భాగాన్ని కీ.శే. డా. అంబ‌డిపూడి నాగ‌భూష‌ణం, రెండో భాగాన్ని డా. ల‌క్ష్మ‌ణాచార్యులు, విష్ణుమ‌హాపురాణాన్ని డా. కేసాప్ర‌గ‌డ స‌త్య‌నారాయ‌ణ సంస్కృతం నుండి తెలుగులోకి అనువ‌దించారు. ఈ సంద‌ర్భంగా పండితులు మాట్లాడుతూ ఈ పురాణాల‌ను భ‌క్తుల‌కు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేసిన‌ టిటిడి అధికారుల సేవ‌ల‌ను కొనియాడారు. అనంత‌రం వారి అనుభ‌వాల‌ను పంచుకున్నారు.

అంత‌కుముందు పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఇన్‌చార్జి ప్ర‌త్యేకాధికారి ఆచార్య ద‌క్షిణామూర్తి శ‌ర్మ ప్రాజెక్టు కార్య‌క‌లాపాల‌ను విశ‌దీక‌రించారు. ఈ పురాణాల్లో 3.8 ల‌క్ష‌ల శ్లోకాలు అందుబాటులో ఉన్నాయ‌ని, వీటిలో ఇప్ప‌టివ‌ర‌కు 3.55 ల‌క్ష‌ల శ్లోకాల‌ను ప‌రిష్క‌రించామ‌ని, మిగిలిన వాటిని త్వ‌ర‌లో పూర్తి చేస్తామ‌ని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో జెఈవో(ఆరోగ్యం, విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనంద‌తీర్థాచార్య‌, శ్వేత సంచాల‌కులు డా.రామాంజుల రెడ్డి, తిరుప‌తికి చెందిన ప‌లువురు పండితులు, సాహితీప్రియులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.