FOCUS ON EMPLOYEES WELFARE -TTD CHAIRMAN _ ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక కృషి – టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

TIRUPATI, 27 APRIL 2023: Special focus is on the employee welfare measures, said TTD Chairman Sri YV Subba Reddy.

After inaugurating a Function Hall in Vinayakanagar quarters for the sake of TTD employees in Tirupati on Thursday, the Chairman speaking to the media said, the two decades old dream has become a reality with the opening of this function hall which was constructed at a cost of Rs.1.40cr.

Upon the instructions of the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy, 300 acres of land has been acquired towards house plots for TTD employees which has been pending for the last several decades.

Similarly many employee-friendly measures like Health Scheme was also implemented.

Later reacting on Sulabh Workers’ lightning strike from the past four days, the TTD Board Chief faulted their act without giving any notice as sanitation is an emergency service in Tirumala which is visited every day by scores of devotees. However, the TTD management has initiated alternative measures and ensured that pilgrims are not thrown into any inconvenience.

TTD will also proceed legally against the fake websites which have indulged in cheating devotees, he added.

TTD EO Sri AV Dharma Reddy, board member Sri Ashok Kumar, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CE Sri Nageswara Rao, SE Sri Venkateswarulu, Estates OSD Sri Mallikharjuna, DyEO Smt Snehalata were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక కృషి – టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుపతి 27 ఏప్రిల్ 2023: ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గదర్శనంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమానికి టీటీడీ ప్రత్యేక కృషి చేస్తోందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.

తిరుపతిలోని వినాయకనగర్ టీటీడీ క్వార్ట్రర్స్ లో ఉద్యోగుల కోసం రూ 1.40 కోట్లతో నిర్మించిన ఫంక్షన్ హాల్ ను గురువారం ఆయన ప్రారంభించారు.

అనంతరం చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగుల 20 సంవత్సరాల కల అయిన ఇంటిస్థలాలను సాకారం చేశామన్నారు. ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో 300 ఎకరాల భూమి సేకరించి ఇందుకు అవసరమైన సొమ్ము జిల్లా కలెక్టర్ కు చెల్లించామని చెప్పారు. భూమి చదును చేసి అభివృద్ధి చేసి ఉద్యోగులకు ఇంటి స్థలాలు అందించే ప్రక్రియ జరుగుతోందని ఆయన తెలిపారు. ఉద్యోగులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు పొందేందుకు ఈ హెచ్ ఎస్ అమలు చేస్తున్నామన్నారు. ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా ఫంక్షన్ హాల్ నిర్మించామని, ఇక్కడ వంటగది, వాష్ రూములు , విశాలమైన ప్రాంగణం ఉన్నాయన్నారు. ఉద్యోగులు మరింతగా భక్తుల సేవ చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.

పారిశుధ్య కార్మికుల సమ్మె సరికాదు

భక్తులకు ఇబ్బంది కలిగించేలా సులభ్ పారిశుధ్య కార్మికుల సమ్మెకు దిగడం సరైంది కాదన్నారు. ముందస్తు నోటీసు లేకుండా తీసుకున్న ఈ నిర్ణయంపై టీటీడీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. అధికారులు, ఉద్యోగులు భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు చైర్మన్ చెప్పారు. ఇదే సందర్భంలో కార్మికుల బెదిరింపులను టీటీడీ లెక్క చేయదనే విషయం గుర్తించాలన్నారు.

భక్తులను మోసగించేలా కొన్ని ఫేక్ వెబ్సైట్లు వ్యవహరిస్తున్నాయని అలాంటి వాటిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని శ్రీ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

టీటీడీ ఈవో శ్రీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, జేఈవోలు శ్రీమతి సదాభార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సిఈ శ్రీనాగేశ్వరరావు, ఎస్ ఈ శ్రీ వెంకటేశ్వర్లు, ఎస్టేట్ ఓఎస్డీ శ్రీమల్లిఖార్జున, డిప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది