FOCUS ON PROVIDING HYGIENE FOOD TO DEVOTEES IN TIRUMALA-TTD EO _ శ్రీవారి భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలు – ఈవో శ్రీ జె శ్యామలరావు
Tirumala, 02 August 2024: TTD EO Sri Syamala Rao reiterated that the hotels and fast food centres in Tirumala should provide clean, quality and delicious food to the devotees who come to have darshan of Srivaru from distant places.
After the Dial Your EO program, speaking to media persons, the EO said, to ensure the health safety and security of the pilgrims, the Food Safety Department will train the hotel staff soon on the hygienic habits and cooking measures to be followed in the eateries. All the hotel owners in Tirumala must obtain Food Safety Department certificate which is mandatory to run the hotel with safety standards, he asserted.
Later, he also briefed the media about the pilgrim details in the month of July.
Number of pilgrims who had darshan – 22.13 lakh
Hundi Collection-Rs.125.35 crore
Number of Srivari Laddus sold – 1.04 Crore
Number of devotees who had Annaprasadam- 24.04 lakh
Number of Tonsurings – 8.67 lakh
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలు – ఈవో శ్రీ జె శ్యామలరావు
తిరుమల, 02 ఆగస్టు 2024: శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు తిరుమలలోని హోటళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పరిశుభ్రమైన, నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలను అందివ్వాలని ఈవో శ్రీ శ్యామల రావు పునరుద్ఘాటించారు. ఇందుకోసం ఇప్పటికే ఆహార పదార్థాల తయారీదారులు మరియు హోటల్ సిబ్బందికి ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. తిరుమలలోని హోటల్ యజమానులందరూ ఫుడ్ సేఫ్టీ విభాగం సర్టిఫికేట్ తప్పనిసరిగా పొందాలన్నారు.
డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో మీడియా సమావేశంలో జూలై నెలలో భక్తులకు సంబంధించిన దర్శనం మరియు ఇతర వివరాలను తెలిపారు.
జూలై నెలలో నమోదైన వివరాలు :
దర్శనం :
శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య – 22.13 లక్షలు.
హుండీ :
హుండీ కానుకలు – రూ.125.35 కోట్లు.
లడ్డూలు :
విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 1.04 కోట్లు.
అన్నప్రసాదం :
అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య – 24.04 లక్షలు.
కల్యాణకట్ట :
తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య – 8.67 లక్షలు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.