TTD EO LISTS OUTS UPCOMING EVENTS IN TIRUMALA _ తిరుమల శ్రీవారి సేవా భాగ్యం నా పూర్వజన్మ సుకృతం
TIRUMALA, 02 AUGUST 2024: TTD EO Sri J Syamala Rao on Friday briefed the devotees about the upcoming mega-religious events in Tirumala.
Before taking calls from the pilgrims during his maiden Dial your EO program held at Annamaiah Bhavan in Tirumala, the EO said, elaborate arrangements for the ensuing annual Srivari Brahmotsavam from October 4 to 12 are set to commence and the officials are directed to complete all preparations by the end of September and ensure that the pilgrims and devotees are not put to any inconvenience. He also said the annual Pavitrotsavams will be observed from October 15 to 17.
Elaborating on the recently taken devotee-friendly measures, the EO said with an aim to provide more darshan time to the common pilgrims, SRIVANI offline quota tickets were restricted to 1000 from July 22 onwards out of which daily 900 Srivani tickets will be issued at Gokulam Rest House in Tirumala and 100 tickets at the Tirupati Airport current booking counter.
The EO also said, steps have been taken to upgrade deliciousness of Srivari Anna Prasadam, non-stop distribution of Anna Prasadam in Queue lines and milk in the compartments. Three officers have been drafted exclusively to supervise the amenties to the pilgrims waiting in outside queue lines and ensure all facilities including Annaprasadam, water, medical available to them without any inconvenience.
Steps have been initiated to eliminate brokers at Tirumala, providing delicious and hygienic food at affordable prices in all the hotels at Tirumala, Srivari laddu quality and taste boosted, TTD IT mechanism strengthened. These are a few more measures taken in the last one month, he added.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల శ్రీవారి సేవా భాగ్యం నా పూర్వజన్మ సుకృతం
• డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో శ్రీ జె శ్యామల రావు
తిరుమల, 2024 ఆగష్టు 02: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు సేవ చేసేందుకు ఇటీవల టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఈవో శ్రీ జె.శ్యామలరావు చెప్పారు.
తిరుమలకు విచ్చేసే భక్తులందరికీ టీటీడీ అందించే శ్రీవారి దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలు మరింత మెరుగ్గా కల్పించేందుకు, అందరి సమన్వయంతో భక్తులకు తిరుమల యాత్ర ఒక దివ్యానుభూతిని కల్పించేలా కృషి చేస్తున్నామని ఆయన తెలియజేశారు.
తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు :
• ఈ ఏడాది అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల పనులను సెప్టెంబరు చివరినాటికి పూర్తి చేసేందుకు అధికారులను ఆదేశించాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపడుతున్నాం.
శ్రీవారి పవిత్రోత్సవాలు :
• ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆగస్టు 14న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
• ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.
శ్రీవారి పుష్కరిణి మూత :
• తిరుమల శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు ఆగస్టు 1 నుండి పుష్కరిణిని మూసివేశాం. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు. శ్రీవారి భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా పుష్కరిణి పైభాగంలో షవర్లు ఏర్పాటుచేశాం. భక్తులు వీటిని వినియోగించుకోవాలని కోరుతున్నాం.
ఇటీవల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తీసుకున్న పలు ముఖ్య నిర్ణయాలు
ఆఫ్‌లైన్‌లో రోజుకు 1000 శ్రీవాణి దర్శనం టికెట్లు
• సామాన్య భక్తులకు దర్శన సమయాన్ని పెంచేందుకుగాను జూలై 22వ తేదీ నుండి ఆఫ్ లైన్‌లో రోజుకు 1000 శ్రీవాణి దర్శనం టికెట్లను మాత్రమే జారీ చేయాలని నిర్ణయించాం.
శ్రీవాణి దాతలకు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900, మిగిలిన 100 టికెట్లను విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో జారీ చేస్తున్నాం.
అన్నప్రసాదాల రుచి మరింత పెంచేందుకు చర్యలు
• తిరుమలలో ప్రతిరోజు వేలాదిమంది భక్తులకు అందించే అన్నప్రసాదాల రుచిని మరింత పెంచేందుకు నాణ్యమైన బియ్యం, వంటశాలలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
• అదేవిధంగా తిరుమలలో తాగునీరు, అన్నప్రసాదాలు, ముడిసరుకులను ఎప్పటికప్పుడు పరిక్షించేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆధ్వర్యంలో అత్యాధునిక ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నాం.
క్యూ లైన్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు
• క్యూలైన్లల్లో, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగు నీరు, పాలు, అన్నప్రసాదాలు, పారిశుద్ధ్య నిర్వహణ, తదితర అంశాలను ఎప్పటికప్పుడు పరివేక్షించేలా ప్రత్యేకంగా కొందరు ఆధికారులకు బాధ్యతలు అప్పగించాం.
• భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లలో ఆరు చోట్ల అన్నప్రసాదాలు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు, అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేశాం.
తిరుమలలో దళారుల ఏరివేతకు చర్యలు
• శ్రీవారి భక్తులకు అవసరమైన వసతి, దర్శనం, ఆర్జితసేవ టికెట్లకు సంబంధించి మోసగిస్తున్న అనేక మంది దళారులను ఎప్పటికప్పుడు కనిపెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం.
తిరుమలలో భక్తులకు సరసమైన ధరలతో పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలి
• శ్రీవారి భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యం. టీటీడి నిబంధనలు పాటించని హోటళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం.
శ్రీవారి లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెంపు
• తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా, రుచికరంగా అందించేందుకు నాణ్యమైన ముడిసరుకులు, నెయ్యి కోనుగొలు చేసేందుకు చర్యలు చేపట్టాం.
టీటీడీ ఐటి వ్యవస్థ మరింత బలోపేతం
• టీటీడీ ఐటి వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్జిత సేవలు, దర్శనం, వసతి తదితర సేవల బుకింగ్‌లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టాం.
• గతంలో వారానికి 1.05 లక్షలు ఇస్తున్న ఎస్‌ఎస్‌డి టోకెన్లను, భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయం తగ్గించేందుకు ప్రస్తుతం 1.47 లక్షలు ఇస్తున్నాం, వీటిని మరికొంత పెంచేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నాం.
– అదేవిధంగా ఎస్ఈడి, ఎస్ఎస్ డి టోకెన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి దర్శనానికి రావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఆదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సీఈఓ ఎస్ వి బి సి శ్రీ షణ్ముఖ్ కుమార్, సి ఈ శ్రీ నాగేశ్వరరావు, సిపిఆర్ఓ డాక్టర్ టి.రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.