GAJA VAHANAM HELD _ గజ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం

Tirupati, 25 February 2025: On the advent of Uttarashada star, Sri Padmavati Devi was paraded on Gaja Vahanam and blessed Her devotees at Tiruchanoor on Tuesday evening.

The vahanam commenced at 7pm.

AEO Sri Devarajulu, VGO Smt Sadalakshmi and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గజ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం

తిరుపతి, 2025 ఫిబ్రవరి 25: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో ఉత్త‌రాషాడ న‌క్ష‌త్రం సంద‌ర్బంగా మంగ‌ళ‌వారం రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనంపై విహ‌రిస్తూ భక్తులను కటాక్షించారు.

అలమేలు మంగ వాహనసేవల్లో గజవాహన సేవకు ప్రత్యేకత ఉంది. గజం ఐశ్వర్యసూచకం. అందుకే ”ఆగజాంతగం ఐశ్వర్యం” అని ఆర్యోక్తి. పాలసముద్రంలో ప్రభవించిన సిరులతల్లిని గజరాజులు భక్తితో అభిషేకించాయని వేదాంతదేశికులు శ్రీస్తుతి చేశారు.

వాహనసేవల్లో ఆలయ ఏఈవో శ్రీ దేవరాజులు, విజీవో శ్రీమతి సదాలక్ష్మి, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.