GANAPATHI HOMAM CONCLUDES _ శ్రీ కపిలేశ్వరాలయంలో ఘ‌నంగా ముగిసిన శ్రీ గణపతి హోమం

Tirupati, 31 Oct. 19: Ganapathi Homam concluded on a grand religious note in Kapileswara Swamy temple on Thursday in Tirupati. 

The Subramanya Homam will be observed in the temple from November 1 to 3.

Temple DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupati were also present. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో ఘ‌నంగా ముగిసిన శ్రీ గణపతి హోమం

తిరుపతి, 2019 అక్టోబరు 31 ;తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన గణపతి హోమం  గురువారం ఘనంగా ముగిసింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు విశేషపూజ హోమ మహోత్సవాలు జరుగుతున్నాయి.

 ఆలయం వెలుపల ఏర్పాటుచేసిన యాగశాలలో శ్రీ వినాయకస్వామి ప్రతిమకు విశేష అలంకరణ చేపట్టారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో అర్చక బృందం పూజ, జపం, గణపతి హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన నిర్వహించారు. 16 నామాలతో గణపతిని స్తుతించారు.

 కాగా సాయంత్రం జపం, హోమం, శ్రీ గణపతి సహస్రనామార్చన, నివేదన, విశేష దీపారాధన, మంత్రపుష్పం మరియు హారతి ఇచ్చారు. గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు హోమంలో పాల్గొన్నారు. గణపతి హోమం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగుతాయని అర్చకులు తెలిపారు.

న‌వంబ‌రు 1వ తేదీ నుంచి శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం :

శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో న‌వంబ‌రు 1 మ‌రియు 2వ తేదీల‌లో శ్రీసుబ్రమణ్య స్వామివారి హోమం రెండు రోజుల పాటు ఘనంగా జరుగనుంది. న‌వంబ‌రు 2న సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామివారి క‌ల్యాణం నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.