GANGA PUJA PERFORMED AT KD AND PD DAMS _ జ‌లాశ‌యాల్లో 544 రోజుల‌కు గాను భ‌క్తులకు సరిపడా నీరు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

Tirumala, 6 Dec. 19: The Ganga Puja was performed by TTD at Kumaradhara and Pasupudhara twin dams in Tirumala on Friday.

TTD EO Sri Anil Kumar Singhal who took part in this fete along with Additional EO Sri AV Dharma Reddy and CVSO Sri Gopinath Jatti speaking to media persons said that among the five major dams in Tirumala, Kumaradhara, Pasupudhara and Akasa Ganga are full to their capacities while Papavinasanam and Gogarbham registered 71% and 65% respectively, The water available in Tirumala Dams and Kalyani Dam at Tirupati will be sufficient for 552 days while the water available in Tirumala dams will suffice for next 285 days, EO added.

The EO said, TTD has organised Kareeri Isthi and Varuna Japam under the blessings of Kanchi Kamakoti Seer with reputed Pundits for three days from May 14 to 18. Though we have not received good downpour in the first half, due to the incessant rains in the last one week, all the dams are brimming full to their capacities with the benign blessings of Lord Venkateswara and Ganga Mata, he added.

Earlier, the EO, Additional EO and others visited the twin dams along with CE Sri Ramachandra Reddy and SE 2 Sri Nageswara Rao. Later a thanksgiving Puja was performed by offering sare in both the dams.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జ‌లాశ‌యాల్లో 544 రోజుల‌కు గాను భ‌క్తులకు సరిపడా నీరు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

కుమార‌ధార, ప‌సుపుధార జ‌లాశ‌యాల్లో ఘ‌నంగా గంగ‌పూజ‌

తిరుమల, 06 డిసెంబ‌రు 2019: కల్యాణి డ్యామ్‌ నీటితో కలుపుకుంటే తిరుమలలోని జ‌లాశ‌యాల్లో 544 రోజుల‌కు గాను భక్తులకు సరిపడా నీరు అందుబాటులో ఉందని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. తిరుమలలోని కుమార‌ధార, ప‌సుపుధార జ‌లాశ‌యాల్లో శుక్ర‌వారం గంగపూజ నిర్వహించారు. టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టితో క‌లిసి ఈవో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ డ్యామ్‌లు పూర్తిస్థాయిలో నిండినపుడు గంగపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు ఆశీస్సులతో మే 14 నుండి 18వ తేదీ వ‌ర‌కు తిరుమలలో కారీరిష్టి యాగం, అమృత‌వ‌ర్షిణి రాగాలాప‌న‌, తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో వరుణజపం నిర్వ‌హించామ‌ని తెలిపారు. శ్రీ‌వారి ఆశీస్సుల‌తో ఈ సంవ‌త్స‌రం విస్తారంగా వ‌ర్షాలు కురిశాయ‌న్నారు. త‌ద్వారా తిరుమ‌ల‌లోని కుమారధార‌, ప‌సుపుధార, ఆకాశ‌గంగ జ‌లాశ‌యాల్లో పూర్తిస్థాయిలో నీటి నిల్వ‌లు ఉన్నాయ‌న్నారు. పాప‌వినాశ‌నం జ‌లాశ‌యం సామ‌ర్థ్యం 5,240 ల‌క్ష‌ల గ్యాల‌న్లు కాగా, ప్ర‌స్తుతం 3,730 ల‌క్ష‌ల గ్యాల‌న్ల(71.18 శాతం) నీరు నిల్వ ఉంద‌ని తెలిపారు. అదేవిధంగా, గోగ‌ర్భం జ‌లాశ‌యం సామ‌ర్థ్యం 2,833 ల‌క్ష‌ల గ్యాల‌న్లు కాగా, ప్ర‌స్తుతం 1,848 ల‌క్ష‌ల గ్యాల‌న్ల(65.23 శాతం) నీరు నిల్వ ఉంద‌ని చెప్పారు. తిరుప‌తిలోని క‌ల్యాణి డ్యామ్‌లో 31.12 శాతం నీరు నిల్వ ఉంద‌ని వివ‌రించారు. ఇంకా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున నీటి నిల్వ‌లు ఇంకా పెరుగుతాయ‌న్నారు. వీటితో పాటు తిరుమ‌ల‌కు శాశ్వ‌తంగా నీటి అవ‌స‌రాలు తీర్చేందుకు బాలాజి రిజ‌ర్వాయ‌ర్ నీటిని వినియోగించుకోవాల‌ని టిటిడి బోర్డు తీర్మానించింద‌ని తెలిపారు.

అంతకుముందు తిరుమలలోని కుమార‌ధార, ప‌సుపుధార జ‌లాశ‌యాల్లో గంగపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పసుపుకుంకుమ, చీర, సారె, పూలు, పండ్లను నీటిలో వదిలి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్ఇ ఎల‌క్ట్రిక‌ల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, ఎస్‌ఇ-2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, డిఎఫ్‌వో శ్రీ ఫ‌ణికుమార్ నాయుడు, విఎస్‌వోలు శ్రీ మ‌నోహ‌ర్‌, శ్రీ ప్ర‌భాక‌ర్‌, ఇఇలు శ్రీ శ్రీ‌హ‌రి, శ్రీ మ‌ల్లికార్జున ప్ర‌సాద్, శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌ ఇతర ఇంజినీరింగ్‌, వాటర్‌ వర్క్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.