THE PRICE OF VIP TICKET IS NOT HIKED-IT IS THE CONTRIBUTION OF PILGRIM TO SRIVANI TRUST-EO _ డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

SRIVANI TRUST AIMS AT CONSTRUCTING SRIVARI TEMPLES IN BACKWARD AREAS

 Tirumala, 6 Dec 2019: Clearing the doubt of a pilgrim caller, TTD EO Sri Anil Kumar Singhal said, the aim behind Sri Venkateswara Aalaya Nirmana (SRIVANI) Trust is construct Sri Venkateswara temples in SC, ST and BC areas and said that Rs.10,000 is the contribution, the devotee make to the Trust whereas the price of VIP Break ticket is still Rs.500 only.

 

Answering to a pilgrim caller Sri Satyanarayana from Kothagudem who said, whether Rs.10,000 is the hiked price for VIP ticket, the EO said, the pilgrims are still in a misconception that TTD has hiked the price of the VIP ticket from Rs.500 to 10,000 which is not correct. “We have privileges for donations ranging over one lakh rupees for other Trusts. But in SRIVANI, for a contribution of Rs.10,000, one ticket will be allotted on a payment of Rs.500. This is only mulled as a one time privilege for donations ranging between Rs.10,000 to Rs.99,999”, he added.

A pilgrim caller from Nellore Smt Kamakshi sought EO to open up a separate line for women to book accommodation in Tirumala, to which the EO replied now the mode of booking accommodation in Tirumala has been modified and made easy and there is no need for any pilgrim to wait for hours in queue lines.

A caller Sri Krishna Rao from Arasaville brought to the notice of EO that there should be a person to supervise the shoe keeping gallery besides main Kalyanakatta in Tirumala as most of them are missing to which EO said it will be executed.

Sri Mohan Rao from Visakhapatnam said, the accommodation in Tirumala and Tirupati should be made pilgrim friendly with minimum facilites to which EO responded the concerned will be instructed to ensure all amenities in various rest houses at Tirumala and Tirupati.

Sri Nagendra Prasad from Tirupati informed EO about the non-vegetarian stalls surrounding TTD Administrative Building Quarters in Tirupati to which EO reacted, he will definitely negotiate with Tirupati Municipal Corporation officials as it falls under the jurisdiction of TMC.

Sri Prakash from Nagari sought EO to provide Edit option in on-line quota under Lucky Dip if they commit error by mistake while entering their personal details to which EO said he will look into the issue.

Additional EO Sri AV Dharma Reddy, JEO Sri P Basant Kumar, CVSO Sri Gopinath Jatti, CE Sri Ramachandra Reddy, Additional EO Sri Venkata Siva Reddy and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు
 
తిరుమల, 06 డిసెంబ‌రు 2019:  తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. సుధాక‌ర్‌రావు – చీపురుప‌ల్లి.

ప్రశ్న: స‌ప్త‌గిరుల చుట్టూ గిరి ప్ర‌ద‌క్షిణ కోసం బాట వేసే అవ‌కాశాన్ని ప‌రిశీలించండి. టిటిడికి విరాళ‌మిచ్చే దాత‌ల‌కు స్వామివారి అక్షింత‌లుగానీ, పుస్త‌క ప్ర‌సాదం గానీ పంపండి?

ఈవో : అధికారుల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాం.

2. ప్ర‌కాష్ – న‌గ‌రి

ప్రశ్న: ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదులో త‌ప్పులు దొర్లుతున్నాయి, ఎడిట్ ఆప్ష‌న్ పెట్టండి?

ఈవో : త‌ప్ప‌కుండా ప‌రిశీలిస్తాం.

3. నాగేంద్ర‌ప్ర‌సాద్ – తిరుప‌తి

ప్రశ్న: తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప‌క్క‌న రోడ్డుపై మాంసాహారం విక్ర‌యించ‌కుండా చూడండి?

ఈవో : ఈ విష‌యాన్ని కార్పొరేష‌న్ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

4. మోహ‌న్ వంశీ – విజ‌య‌వాడ‌, భావ‌నారాయ‌ణ – గుంటూరు, మోహ‌న్‌రావు – విశాఖ‌.

ప్రశ్న: తిరుప‌తిలోని విష్ణునివాసంలోనూ కొన్ని గ‌దుల‌కు అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ క‌ల్పించండి? శ్రీ‌నివాసంలో  గ‌దులు కేటాయించే స‌మ‌యాన్ని మార్చండి?

ఈవో : శ్రీ‌నివాసం, విష్ణునివాసంలో 50 శాతం గ‌దుల‌కు అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యం ఉంది. భ‌క్తుల అభిప్రాయాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని శ్రీ‌నివాసంలో  గ‌దులు కేటాయించే స‌మ‌యాన్ని మారుస్తాం.

5. శ్రీ‌నివాస‌రెడ్డి – అన‌ప‌ర్తి

ప్రశ్న: ఇదివ‌ర‌కు స్కౌట్స్‌కు వ‌స్తున్నాం. శ్రీ‌వారి సేవ అవ‌కాశం క‌ల్పించండి?

ఈవో : శ్రీ‌వారి సేవ‌కు రావ‌చ్చు.

6. శ్రీ‌నివాస్ – హైద‌రాబాద్‌

ప్రశ్న: ద‌ర్శ‌నం చేసుకుని బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడుకునేందుకు ఉచితంగా ఫోన్ సౌక‌ర్యం క‌ల్పించండి. రూ.300/- భ‌క్తుల‌ను ధ్వ‌జ‌స్తంభాన్ని తాక‌నివ్వండి. స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు కూడా సంప్ర‌దాయ వ‌స్త్రధార‌ణ అమ‌లుచేయండి ?

ఈవో : భ‌క్తుల కోరిక మేరకు గ‌తంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఫోన్లు అందుబాటులో ఉంచాం. ఆల‌యం వెలుప‌ల ఫోన్లు పెట్టే విష‌యాన్ని ప‌రిశీలిస్తాం. భ‌క్తులంద‌రూ ధ్వ‌జ‌స్తంభాన్ని తాకేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తాం. సంప్ర‌దాయ వ‌స్త్రధార‌ణ అంశంపై భ‌క్తుల అభిప్రాయాల‌ను సేక‌రిస్తాం.

7. ప్ర‌సాద్ – తిరుప‌తి

ప్రశ్న: టైంస్లాట్ ద‌ర్శ‌నం భ‌క్తుల కోసం నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల మొద‌ట్లో ల‌గేజి కౌంట‌ర్ ఏర్పాటు చేయండి ?

ఈవో : ప‌రిశీలించి త‌గిన నిర్ణ‌యం తీసుకుంటాం.

8. కృష్ణ – తిరుప‌తి

ప్రశ్న: న‌డ‌క‌మార్గంలో జిఎన్‌సి టోల్ గేట్ స‌మీపంలో కొంత దూరం షెల్ట‌ర్ లేక భ‌క్తులు ఇబ్బందిప‌డుతున్నారు. చివ‌రిమెట్టు వ‌ద్ద హుండీ ఏర్పాటుచేయండి ?

ఈవో : అలిపిరి న‌డ‌క మార్గం మొత్తం నూత‌న షెల్ట‌ర్ ఏర్పాటు చేస్తాం. హుండీ విష‌యాన్ని ప‌రిశీలిస్తాం.

9. జ్ఞాన‌ప్ర‌కాష్‌ – తిరుప‌తి

ప్రశ్న: తిరుప‌తిలో త్యాగ‌రాజ మందిరం ఏర్పాటుకు స‌హ‌క‌రించండి?

ఈవో : ట‌్ర‌స్టు స‌భ్యులు సంప్ర‌దిస్తే నిబంధ‌న‌ల ప్ర‌కారం సాయం చేసే అంశాన్ని ప‌రిశీలిస్తాం.

10. కృష్ణారావు – అర‌స‌వెల్లి

ప్రశ్న: ప‌్ర‌ధాన క‌ల్యాణ‌క‌ట్ట వ‌ద్ద గ‌ల పాద‌ర‌క్ష‌ల కౌంట‌ర్‌లో సిబ్బందిని ఏర్పాటు చేయండి?

ఈవో : త‌ప్ప‌కుండా ఏర్పాటు చేస్తాం.

11. వెంక‌ట్రామాచారి – మ‌ద‌న‌ప‌ల్లి

ప్రశ్న: బ‌్ర‌హ్మోత్స‌వాల్లో వ‌ర్షం ప‌డ‌డం వ‌ల్ల ఇబ్బంది ప‌డ్డాం. గ్యాల‌రీల్లో షెడ్లు ఏర్పాటు చేయండి ?

ఈవో : వాతావ‌ర‌ణం అనుకూలించ‌క‌పోవ‌డం వ‌ల్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో షెడ్లు వేయ‌లేక‌పోయాం. దీనిపై అధ్య‌య‌నం చేస్తున్నాం.

12. స‌త్యనారాయ‌ణ – కొత్త‌గూడెం

ప్రశ్న: శ్రీ‌వాణి ట్ర‌స్టుకు 10 వేలు విరాళ‌మిస్తే కుటుంబం మొత్తానికి బ్రేక్ టికెట్లు ఇస్తారా?

ఈవో : ఎస్‌సి, ఎస్‌టి, బిసి ప్రాంతాల్లో ఆల‌యాల నిర్మాణానికి, స‌నాత‌న ధ‌ర్మ ప్ర‌చారానికి శ్రీ‌వారి ట్ర‌స్టు నిధులను వినియోగిస్తాం. రూ.10 వేలు విరాళ‌మిస్తే ఒక బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్ కొనుగోలు చేసేందుకు అవ‌కాశం ఉంటుంది.

12. కామాక్షి – నెల్లూరు

ప్రశ్న: గ‌దుల కోసం మ‌హిళ‌లకు ప్ర‌త్యేక క్యూ ఏర్పాటు చేయండి ?

ఈవో : భ‌క్తులు క్యూలో వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేకుండా ముందుగా న‌మోదు చేసుకునే విధానం ఉంది. ఈ ప్ర‌కారం సంబంధిత భ‌క్తుల‌కు ఎస్ఎంఎస్ ద్వారా గ‌ది కేటాయింపు స‌మాచారం తెలియ‌జేస్తారు.

13. ర‌మ‌ణ – వైరా

ప్రశ్న: జ‌న‌ర‌ల్ కేట‌గిరీలో ఆర్జిత సేవ‌లు పొందిన భ‌క్తులకు తిరిగి ల‌క్కీడిప్‌లో టికెట్లు వ‌స్తే రెండు సార్లు తిరుమ‌లకు రావాల్సి వ‌స్తోంది?

ఈవో : మొద‌ట ల‌క్కీడిప్‌లో టికెట్ వ‌స్తుందో రాదో ఖ‌రారు చేసుకుని ఆ త‌రువాత జ‌న‌ర‌ల్ కేట‌గిరీలో టికెట్లు పొందండి.

14. ర‌మేష్ – అనంత‌పురం

ప్రశ్న: శ్రీ‌వారి సేవ‌కు వ‌చ్చాను. భ‌క్తుల‌కు చ‌క్క‌గా శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నారు, కృత‌జ్ఞ‌త‌లు. ప్ర‌యివేటు ట్యాక్సీల వ‌ల్ల కాలుష్యం పెరుగుతోంది ?

ఈవో : ధ‌న్య‌వాదాలు. కాలుష్యం పెర‌గ‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాం. శ్రీ‌వారి సేవ‌కులు ఖాళీ స‌మ‌యంలో సేవా స‌ద‌న్‌లో ఫీడ్‌బ్యాక్ న‌మోదు చేయండి.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రామ‌చంద్రారెడ్డి, ఎస్ఇ ఎల‌క్ట్రిక‌ల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, విఎస్వోలు శ్రీ మ‌నోహ‌ర్‌, శ్రీ ప్ర‌భాక‌ర్ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

జనవరి 6న వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు :

– జనవరి 6న వైకుంఠ ఏకాదశి పర్వదినానికి తిరుమలకు విచ్చేసే భక్తులకు విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నాం. భ‌క్తులు చ‌లికి ఇబ్బందులు ప‌డ‌కుండా మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు చేస్తాం. నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో సుమారు 10 వేల మందికి స‌రిప‌డా నూత‌న షెడ్లు అందుబాటులోకి తీసుకొస్తాం.

ప్రత్యేక దర్శనాలు, గదుల కేటాయింపు నిలుపుదల :

– నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబరు 30 నుండి జనవరి 1వ తేదీ వరకు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 4 నుండి 7వ తేదీ వరకు దాతలకు ప్రత్యేక దర్శనాలను, గదులను కేటాయించడం లేదు.

– డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో, జనవరి 5 నుండి 7వ తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు కేటాయించడం లేదు.

డిసెంబరు 7న గీతాజయంతి :

– డిసెంబరు 7న 10 వేల మంది విద్యార్థులతో తిరుపతిలో గీతాజయంతి నిర్వహిస్తాం. రాష్ట్ర‌వ్యాప్తంగా ఈ ఉత్స‌వాలు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి.

టిటిడి డైరీలు, క్యాలెండర్లు  :

– 2020 టిటిడి క్యాలెండర్లు తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా, క్యాలెండర్లు, డైరీలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న టిటిడి సమాచార కేంద్రాల్లో డిసెంబరు 10వ తేదీ నుండి అందుబాటులో ఉంటాయి.

శ్రీవాణి ట్రస్టు  :

– మే 25వ తేదీ నుండి శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్టు(శ్రీవాణి) కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. నవంబరు 4న ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రారంభించడమైనది. ఇప్ప‌టివ‌ర‌కు ఆన్‌లైన్‌లో 2319 మంది, ఆఫ్‌లైన్‌లో 4,489 మంది క‌లిపి మొత్తం 6,813 మంది దాత‌లు విరాళాలు స‌మ‌ర్పించారు.

డిసెంబరు 26న సూర్యగ్రహణం :

– సూర్యగ్రహణం కారణంగా డిసెంబరు 25న బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూసివేసి డిసెంబరు 26న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తెరుస్తారు. శుద్ధి అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. సూర్యగ్ర‌హ‌ణం కార‌ణంగా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ఉండ‌దు. ఈ విష‌యాల‌ను దృష్టిలో ఉంచుకుని భ‌క్తులు త‌మ తిరుమ‌ల యాత్ర‌కు ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

బాలాజి రిజర్వాయర్‌ :

– తిరుమలలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బాలాజి రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం. ఇందుకోసం అంచనాలను రూపొందిస్తున్నాం.

సామాజిక మాధ్య‌మాల్లో దుష్ప్ర‌చారాన్ని న‌మ్మ‌కండి :

–       టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారానికి క‌ట్టుబ‌డి ఉంది. కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని సామాజిక మాధ్య‌మాల్లో టిటిడిపై దుష్ప్ర‌చారం చేస్తున్నారు. ఇలాంటి వాటిని న‌మ్మ‌కుండా భ‌క్తులు సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించాల‌ని కోరుతున్నాం.

అనంత‌రం ఈ ఏడాది ఏప్రిల్ నుండి న‌వంబ‌రు నెల వ‌ర‌కు న‌మోదైన హుండీ ఆదాయం, బంగారం, వెండి విరాళాలు, వివిధ ట్ర‌స్టుల‌కు వ‌చ్చిన విరాళాలు, జ‌లాశ‌యాల్లోని నీటి నిల్వ‌ల‌ను ఈవో తెలియ‌జేశారు.

దర్శనం :

– గతేడాది న‌వంబ‌రులో 20.93 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది న‌వంబ‌రులో 21.16 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

హుండీ ఆదాయం :

– శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది న‌వంబ‌రులో రూ.86.77 కోట్లు కాగా, ఈ ఏడాది న‌వంబ‌రులో రూ.93.77 కోట్లు వచ్చింది.

అన్నప్రసాదం :

– గతేడాది న‌వంబ‌రులో 45.47 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది న‌వంబ‌రులో 44.73 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది.

లడ్డూలు :

– గతేడాది న‌వంబ‌రులో 90.89 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది న‌వంబ‌రులో 99.94 ల‌క్ష‌ల లడ్డూలను అందించాం.

గ‌దులు :

– గ‌దుల ఆక్యుపెన్సీ గతేడాది న‌వంబ‌రులో 104 శాతం న‌మోదు కాగా, ఈ ఏడాది న‌వంబ‌రులో 106 శాతం న‌మోదైంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.