GARUDA SEVA HELD _ తిరుమ‌ల‌లో శ్రావ‌ణ పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

TIRUMALA, 22 AUGUST 2021:The monthly Garuda Seva held on the auspicious day of Shravana Pournami on Sunday evening.

Braving the thunderous downpour, the devotees stranded in galleries to catch a glimpse of Sri Malayappa on Garuda Vahana.

The procession along four Mada streets was cancelled due to heavy rain and the Lord blessed the devotees in all His divine splendour on the mighty Garuda Vahanam.

The TTD authorities made arrangements to ensure all the devotees who were gathered in galleries beget the blessings of Srivaru on Garuda Vahanam.

Temple DyEO Sri Ramesh Babu, VGO Bali Reddy and others were also present.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల‌లో శ్రావ‌ణ పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

తిరుమల, 2021 ఆగ‌స్టు 22: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి కుంభవృష్టి కారణంగా వాహన మండపంలో పౌర్ణమి గరుడసేవ జరిగింది. శ్రావ‌ణ పౌర్ణ‌మి సంద‌ర్భంగా రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగాధగా మెరిసిపోతున్న గరుడుని అధిరోహించి వాహన మండపంలోనే భక్తులకు దర్శనమిచ్చారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, విజివో శ్రీ బాల్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది