GARUDA VAHANA NARAYANA _ గ‌రుడ వాహ‌నంపై శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి రాజ‌సం

Appalayagunta, 23 Jun. 21: On the fifth day evening, Sri Prasanna Venkateswara Swamy in His own Avatar took a majestic ride on Garuda Vahana.

As part of the ongoing annual brahmotsavams at Appalayagunta, on Wednesday evening Sri Prasanna Venkateswara Swamy, seated majestically on His favourite Garuda Vahana to bless the devotees which was held in Ekantam following Covid norms.

FACAO Sri Balaji, Deputy EO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy, Superintendent Sri Gopalakrishna Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గ‌రుడ వాహ‌నంపై శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి రాజ‌సం

తిరుపతి, 2021 జూన్ 23: అప్పలాయగుంట శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధ‌వారం సాయంత్రం విశేషమైన గరుడ వాహనసేవ జరిగింది. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.

స్వామివారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుంద‌ని భక్తుల నమ్మకం. అందుకే గరుడసేవకు ఎనలేని విశిష్టత ఏర్పడింది.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఎఫ్ ఏ అండ్ సి ఏవో శ్రీ బాలాజి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు మ‌రియు కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సూర్య‌కుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ గోపాల కృష్ణ‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీ‌నివాసులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.