JYESTABHISHEKAM ENTERS SECOND DAY _ ముత్యపు కవచంలో శ్రీ మలయప్ప అభయం

Tirumala, 23 Jun. 21: On the second day of the annual Jyestabhishekam commenced held in Tirumala temple on Wednesday, the processional deity appeared in Mutyapu Kavacham.

As part of this fete, Snapana Tirumanjanam was performed in the morning.

Later in the evening, after Sahasra Deepalankara Seva, Sri Malayappa Swamy decked in pearl armour will be taken on a celestial ride along four Mada streets.

Both the Senior and Junior Pontiffs of Tirumala and other temple officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ముత్యపు కవచంలో శ్రీ మలయప్ప అభయం

తిరుమల, 2021 జూన్ 23: తిరుమల శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు బుధ‌వారం శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి అభ‌య‌మిచ్చారు.

ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. అనంత‌రం ఆలయ అర్చకులు మరియు వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారికి, దేవేరులకు శ‌త‌క‌ల‌శ తిరుమంజ‌నం చేపట్టారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారికి ముత్యపు కవచ సమర్పణ జరిగింది. స‌హ‌స్ర‌దీపాలంకార సేవ త‌రువాత స్వామి, అమ్మ‌వార్లు ముత్య‌పు క‌వ‌చం ధ‌రించి ఆల‌య మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.