GEAR UP FOR V-DAY-TIRUMALA JEO_ వైకుంఠ ఏకాదశికి మరింత మెరుగ్గా ఏర్పాట్లు : జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 17 October 2017: With over two months left, all the departments should gear up for the next upcoming big religious fete, Vaikuntha Ekadasi which occurs on December 29, said Tirumala JEO Sri K S Sreenivasa Raju.

The Weekly review meeting with senior officers was held at Annamaiah Bhavan in Tirumala on Tuesday. Speaking on this occasion, the JEO said, that the departments should come out with a concrete action plan for pilgrim crowd management on the big day.

Later he also reviewed on the change in the timings of Vahana Sevas during Brahmotsavams. “The proposed timings will be discussed with Jeeyangars and Archakas soon and a decision will be taken later”, he added.

Over the instructions of TTD EO Sri Anil Kumar Singhal, following the suggestions from pilgrims, a Help line exclusively for Facility Management Services (FMS) will be set up soon. The pilgrims with regard to any complaints in the rest houses can call this number and get the problem rectified immediately”, he added.

CE Sri Chandra Sekhar Reddy, FACAO Sri O Balaji, DyEOs Sri Kodanda Rama Rao, Sri Venu Gopal, Sri Harindranath, Sri Rajendrudu, Sri Venkataiah, VGO Sri Ravindra Reddy, GM Transport Sri Sesha Reddy, CMO Dr Nageswara Rao and others were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

వైకుంఠ ఏకాదశికి మరింత మెరుగ్గా ఏర్పాట్లు : జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

అక్టోబరు 17, తిరుమల, 2017: ఈ ఏడాది డిసెంబరు 29, 30వ తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా విశేషసంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరింత మెరుగైన ఏర్పాట్లు చేపడతామని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం అధికారులతో జెఈవో వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మూెత్సవాల తరువాత వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు ఎక్కువ మంది భక్తులు వస్తారని, ఏర్పాట్లకు సంబంధించి రెండు నెలల ముందుగానే ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్‌, విజిలెన్స్‌ అధికారులు సమన్వయం చేసుకుని సమర్థవంతంగా క్యూలైన్లు నిర్వహించాలని సూచించారు. అనంతరం బ్రహ్మూెత్సవాల్లో వాహనసేవల సమయం మార్పు అంశంపై చర్చించారు. ఈ విషయంపై జీయర్‌స్వాములు, ఆచార్యపురుషులతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని జెఈవో తెలిపారు. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు, భక్తుల నుంచి వచ్చిన సూచనలను దృష్టిలో ఉంచుకుని ఎఫ్‌ఎంఎస్‌ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గదులు పొందిన భక్తులకు ఏవైనా సమస్యలుంటే ఈ నంబరుకు ఫోన్‌చేసి పరిష్కరించుకుంటారని తెలియజేశారు.

ఈ సమావేశంలో టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ ఓ.బాలాజి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ కోదండరామారావు, శ్రీ వేణుగోపాల్‌, శ్రీ హరీంద్రనాథ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.