DEEPAVALI ASTHANAM IN TIRUMALA ON OCT 19_ అక్టోబరు 19న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
Tirumala, 17 October 2017: The annual Deepavali Asthanam will be performed in Tirumala temple on October 19 on Thursday in connection with Deepavali, which happens to be one of the most important religious festivities that is being observed by Hindus.
The processional deities will be brought to Bangaru Vakili inside sanctum and Asthanam is performed between 7am and 9am. Later Harati and Nivedana will be rendered.
TTD has cancelled all the arjitha sevas on the day following the festival except for Sahasra Deepalankara Seva which takes place in the evening.
TTD top brass officials and authorities will take part in this fete.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI
అక్టోబరు 19న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
అక్టోబరు 17, తిరుమల, 2017: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 19వ తేదీనాడు ‘దీపావళి ఆస్థానాన్ని’ టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య (దీపావళి) నాడు యథాప్రకారంగా శ్రీవేంకటేశ్వరస్వామివారికి సుప్రభాతం మొదలుకొని మొదటిగంట నివేదన వరకు జరుగుతాయి.
అనంతరం ఉదయం 7 నుండి ఉదయం 9 గం||ల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవాలను టిటిడి రద్దు చేసింది. అయితే తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇక సుప్రభాతం మరియు సహస్రదీపాలంకార సేవలకు యథావిధిగా గ హస్థ భక్తులను అనుమతిస్తారు.
ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలోనికి వస్తారు. ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామిని బంగారువాకిలి ముందు ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వారులకు అభిముఖంగా ఏర్పాటు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.