GET READY FOR YET ANOTHER CHALLENGING TASK-ADDNL.EO _ అధికారులు, సిబ్బంది స‌మిష్టిగా ప‌నిచేసి భ‌క్తుల‌కు సేవ‌లందించాలి : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

ENSURE SUCCESS WITH TEAM WORK

Tirumala, 6 Jun. 20: As the TTD is all set to reopen darshan of Lord Venkateswara almost after 80days from Monday, June 8 onwards, TTD Additional EO Sri AV Dharma Reddy called upon all HoDs to ensure the most challenging task with team work. 

During his review meeting at Annamaiah Bhavan in Tirumala on Saturday evening with all HoDs over the arrangements for darshan which commences with employees on a trial basis on Monday, the Additional EO asked all the departments to work with more dedication. “We have successfully carried out many challenging tasks including mega religious events, sale of laddus etc. with teamwork. This one is yet another unique task which need to be handled with even more care”, he observed. 

He reviewed on the arrangements made by various departments following the COVID 19 guidelines. Some excerpts

As against the usual capacity of 1000 persons per dining hall at one go in the massive Annaprasadam complex at Tirumala, the capacity per hall is restricted to 200 only. 

All Kalyanakattas will function with regular barbers with a distance of 10feet in between.

No mini laddu, theertham and shatari shall be given.

All health kits kept ready and sanitizers placed at all vital points 

Services of a limited number of volunteers at Laddu counters, Vaikuntham and Annaprasadam.

Arrangements:

All the vital areas including Queue complex, temple, annaprasadam have been marked following guidelines of social distancing.

All Health Gadgets including varieties of masks, gloves, sanitizers, thermal screening equipment etc. Have been procured by Health Wing

The Additional EO along Senior Officers verified all the gadgets.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అధికారులు, సిబ్బంది స‌మిష్టిగా ప‌నిచేసి భ‌క్తుల‌కు సేవ‌లందించాలి : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

జూన్ 06, తిరుమల  2020: టిటిడి అధికారులు, సిబ్బంది స‌మిష్టిగా ప‌నిచేసి శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి సూచించారు. క‌రోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో అన్నిచోట్లా ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు చేపట్టాల‌న్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం సాయంత్రం వివిధ విభాగాల అధికారులతో అద‌న‌పు ఈవో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ శ్రీవారి దర్శించుకునేందుకు వ‌చ్చే భక్తులు మాస్కులు ధ‌రించి భౌతిక దూరం పాటించి టిటిడికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. శ్రీ‌వారి ఆల‌యంలో తీర్థం, శ‌ఠారి, చిన్నలడ్డూ ప్ర‌సాదం ఉండవన్నారు. భక్తులందరికీ ఒక ఉచిత ల‌డ్డూ ప్ర‌సాదం కొన‌సాగుతుంద‌ని, అద‌నంగా కావాల్సిన వారు ఒకటి 50 రూపాయలు చొప్పున ల‌డ్డూ కౌంట‌ర్ల‌లో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో నాలుగు హాళ్ల‌ను వినియోగిస్తామని, ఒక్కో హాల్లో గతంలో అనుమతించే వెయ్యి మందికి బదులు, ప్రస్తుతం 200 మందిని మాత్రమే అనుమతిస్తామని వివరించారు. ఇక్కడ బిసిబెళా బాత్, పెరుగన్నం భక్తులకు అందిస్తామని తెలిపారు.

అన్ని విభాగాల్లో భ‌క్తుల‌కు ద‌గ్గ‌ర‌గా సేవ‌లందించే సిబ్బందికి అవసరమైన పిపిఇ కిట్లను ఆరోగ్య శాఖ అధికారి సమకూర్చుకోవాలని అద‌న‌పు ఈవో సూచించారు. అలిపిరిలో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్, వాహనాల తనిఖీల అనంతరం దర్శన టికెట్లు ఉన్న వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తారని చెప్పారు. టీటీడీలోని అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా శ్రీవారి దర్శన టికెట్ల కోసం ఇంట్రానెట్‌లో నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు అన్ని కల్యాణకట్టలను తెరిచి రెగ్యులర్ క్షుర‌కుల‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. క‌ల్యాణ‌క‌ట్ట‌లో క్షుర‌కుల మ‌ధ్య 10 అడుగుల దూరం ఉండేలా మార్కింగ్ చేసిన‌ట్టు తెలిపారు. ఈ స‌మావేశంలో అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి స‌ర్వం సిద్ధం

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సోమ‌వారం నుండి ప్ర‌యోగాత్మ‌కంగా భ‌క్తుల‌ను అనుమ‌తించ‌నున్న క్ర‌మంలో తిరుమ‌ల‌లో అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, శ్రీ‌వారి ఆల‌యం, అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, క‌ల్యాణ‌క‌ట్ట ప్రాంతాల్లో భౌతిక దూరాన్ని పాటించేందుకు వీలుగా మార్కింగ్ చేశారు. భ‌క్తుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వివిధ ప్రాంతాల్లో డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటుచేశారు. ఆయా ప్రాంతాల్లో శానిటైజ‌ర్లు అందుబాటులో ఉంచారు. భ‌క్తుల‌కు ద‌గ్గ‌ర‌గా సేవ‌లందించే సిబ్బంది కోసం పిపిఇ కిట్లను అందుబాటులో ఉంచుకున్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.