JYESTABHISHEKAM CONCLUDES _ తిరుమ‌ల‌లో ముగిసిన జ్యేష్టాభిషేకం

Tirumala, 6 June 2020: The annual three-day Jyestabhishekam concluded on Saturday in Srivari Temple at Tirumala.

Jyestabhishekam also is known as Abhidyeyaka Abhishekam is considered as one of the most important annual festivals that is being observed in Tirumala for three days in the month of Jyesta with the concluding fete coinciding with the advent of Jyesta star in the constellation. 

After Second Naivedyam Bell, the utsava deities of Sri Malayappa Swamy with Sridevi and Bhudevi were brought to Kalyana Mandapam in Sampangi Prakaram and Snapana Tirumanjanam was performed amidst the chanting of Panchasuktas.

Later, in the evening the deities are decked with Golden Armour (Bangaru Kavacham). This armour will remain on the deities till Jyestabhishekam next year. 

HH Sri Pedda Jiyangar Swamy, HH Sri Chinna Jiyangar Swamy, TTD Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy also participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమ‌ల‌లో ముగిసిన జ్యేష్టాభిషేకం

స్వర్ణ కవచంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు

జూన్ 06, తిరుమల  2020: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్టాభిషేకం శ‌నివారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో పున‌ర్ద‌ర్శ‌న‌మిచ్చారు. మళ్లీ జ్యేష్టాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు.

ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీమలయప్ప స్వామివారికి, దేవేరులకు స్నపనతిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయర్‌స్వామి, టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.