GLORY OF SRI KAPILESWARA SWAMY ON MAKARA VAHANAM _ మకర వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి వైభవం
Tirupati, 22 February 2025: On the fourth day of Sri Kapileswara Swamy Brahmotsavam, Sri Somaskandamurthy along with Kamakshi Ammavaru took out a celestial ride on the Makara Vahanam.
After that, Snapana Tirumanjanam was held to the utsava deities.
Temple Deputy EO Sri. Devendra Babu, AEO Sri. Subbaraju, Superintendent Sri. Chandrasekhar, Sr Asst. Sri Ravi, temple priests, other officials and especially devotees participated in Vahana Seva.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మకర వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి వైభవం
తిరుపతి, 2025 ఫిబ్రవరి 22: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం ఉదయం 7 గంటలకు శ్రీ కపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
స్వామివారి వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ ఎల్ టైప్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. వాహనసేవలో భక్తజన బృందాల చెక్కభజనలు, కేరళ కళాకారుల వాయద్యాలు ఆకట్టుకున్నాయి.
మకరం గంగాదేవికి నిత్యవాహనం. గంగ పరమశివుని శిరస్సుపై నివసిస్తున్నది. గంగాదేవి వాహనమైన మకరం తపమాచరించి శివానుగ్రహాన్ని పొంది ఆ పరమశివునికి వాహనమైందని శైవాగమాలు తెలియజేస్తున్నాయి. మకరం జీవప్రకృతికి ఉదాహరణ. భగవంతుని ఆశ్రయించినంత వరకు జీవుడు నీటిలో మొసలిలా బలపరాక్రమంతో జీవించవచ్చును.
అనంతరం శ్రీ స్కోమస్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.
రాత్రి 7 నుండి 9 గంటల వరకు శేష(నాగ) వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు.
వాహనసేవలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.