GODDESS AS PATTABHI RAMA BLESSES ON HANUMANTHA VAHANAM _ హనుమంత వాహనంపై పట్టాభిరాముని అలంకారంలో శ్రీ పద్మావతి

TIRUPATI, 03 DECEMBER 2021: On the fourth day evening of the ongoing annual Kartika Brahmotsavams at Tiruchanoor, Sri Padmavathi Devi in the guise of Sri Pattabhi Rama blessed the devotees on Hanumantha Vahanam on Friday evening.

This fete was held in Ekantam due to Covid restrictions.

Both the Senior and Junior Pontiffs of Tirumala, Chandragiri legislator and TTD ex-officio member Dr C Bhaskar Reddy, JEO Sri Veerabrahmam, Agama Advisor Sri Srinivasacharyulu, DyEO Smt Kasturi Bai, Archaka Sri Babu Swamy, AEO Sri Prabhakar Reddy Superintendents Sri Seshagiri, Sri Madhusudhan, AVSO Sri Venkataramana were also present.

GAJA VAHANAM

The most important Vahana Seva among all, Gaja Vahanam will be observed on Saturday evening. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

హనుమంత వాహనంపై పట్టాభిరాముని అలంకారంలో శ్రీ పద్మావతి
 
తిరుపతి, 2021 డిసెంబరు 03: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం రాత్రి హనుమంత వాహనంపై పట్టాభిరాముని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.
 
హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్యభక్తుడు.త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలమేలుమంగ  బ్రహ్మోత్సవాలలో హనుమంతున్ని వాహనంగా చేసుకుంది.
 
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి బోర్డు సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి కస్తూరిబాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగ‌మ‌స‌ల‌హాదారు శ్రీ శ్రీ‌నివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ మధుసుదన్, ఏవిఎస్వో శ్రీ వెంకటరమణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.