GOMATA PAINTING RELEASED _ శ్రీ‌నివాసుని వృత్తాంతంతో కూడిన‌ పెయింటింగ్ ఆవిష్క‌ర‌ణ‌

Tirumala, 28 Dec. 19: TTD Chairman Sri YV Subba Reddy along with TTD EO Sri Anil Kumar Singhal and others released the photo of “Gomata and its significance” donated by TTD Trust board member Sri Siva Kumar on Saturday.

The photo release took place at Annamaiah Bhavan in Tirumala. Sri Siva Kumar has come forward with a novel idea of protecting one lakh cows at one place in the state of  Telengana.  He has brought out the noble concept and theme of his generous idea in the form of a Cheriyal Paint drawn by renowned artist Sri Vaikuntham.

The painting portrayed the most important episode of the legend, Venkatachala Mahatyam where in Lord Maha Vishnu takes form as Srinivasa and leaves Vaikuntha in search of His love Maha Lakshmi and takes abode underneath an anthill while Lord Siva assuming the form of holy cow and Lord Brahma as calf feed Srinivasa. The angered cowherd is also seen in the photo with an axe. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

 

శ్రీ‌నివాసుని వృత్తాంతంతో కూడిన‌ పెయింటింగ్ ఆవిష్క‌ర‌ణ‌

డిసెంబరు 2019, తిరుమ‌ల 28: వేంక‌టాచ‌ల మ‌హ‌త్యంలోని శ్రీ‌నివాసుని వృత్తాంతాన్ని తెలిపేలా రూపొందించిన‌ పెయింటింగ్‌ను టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి శ‌నివారం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఆవిష్క‌రించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన టిటిడి బోర్డు సభ్యుడు శ్రీ కె.శివ‌కుమార్ ఆధ్వ‌ర్యంలో ఈ పెయింటింగ్‌ను రూపొందించారు.

జాతీయ స్థాయి చిత్ర‌కారుడు శ్రీ డి.వైకుంఠం న‌కాష్ దీన్ని రూపొందించారు. శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని వెతుక్కుంటూ వ‌చ్చిన‌ శ్రీ‌నివాసుడు అల‌సిపోయి పుట్ట‌లో సేద‌తీర‌డం, గోవు పాలివ్వ‌డం, ప‌శువుల కాప‌రి శిక్షించ‌డం త‌దిత‌ర అంశాల‌తో కూడిన వృత్తాంతంతో పెయింటింగ్‌ను రూపొందించారు. గోవుల‌ను ర‌క్షించేందుకు ల‌క్ష గోవుల‌తో గోశాల ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ఈ సంద‌ర్భంగా శ్రీ శివ‌కుమార్ తెలిపారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.