IMPORTANT EXCERPTS DURING TTD TRUST BOARD MEETING _ టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

Tirumala, 28 Dec. 19: The TTD Trust Board Meeting was held under the Chairmanship of Sri YV Subba Reddy at Annamaiah Bhavan in Tirumala on Saturday. TTD Ex-officio including TTD EO Sri Anil Kumar Singhal, Smt Usha Rani-Secretary to Government of AP (Land, Revenue and DM), Endowments Commissioner Smt Padma, TUDA Chairman, Chief Whip, Chandragiri legislator Sri C Bhaskar Reddy and other board members, special invitees were also present.

The board has discussed in elaborate on various issues. Some excerpts:

* When the estimated budget for the financial year 2019-20 is Rs.3116.25crore, the revised estimates for the year stood at Rs.3,243.19crore. The revenue through Srivari Hundi estimated as Rs.1231crore and revised estimates was Rs.1285crore while the revenue garnered out from Prasadam receipts recorded as Rs.330crore as against the estimated amount of Rs.270crore.

* An administrative sanction of Rs.10crore for providing RCC Crash Barriers and CC wall along the Second Ghat Road. Expert Opinion invited from IIT Chennai, JNTU experts on laying of CC pavements for both ghat roads. 

* Gold malam works for the Vimanam of Sri Varaha Swamy temple at an estimated cost of Rs.14crore and necessary gold will be drawn from TTD treasury.

* Sanction of Rs.14.50crore towards the renovation of TTD Administrative Building in Tirupati.

* Approved for administrative sanction of Rs.30crore towards the construction of Sri Venkateswara Swamy temple and Information Centre at Bandra, Mumbai.

* Apart from this, the Jammu Govenment has come forward to provide land towards the construction of Sri Venkateswara Swamy temple. Similarly, the Government of UP has also requested TTD to construct Sri Venkateswara Swamy temple on provision of appropriate place.

* Providing centralized AC system for Sri Padmavathi and Sri Srinivasa Kalyana Mandapams of TTD in Tirupati at a cost of Rs.3.20crore.

* The services of Dr AV Ramana Deekshitulu will be taken in Srivari temple as Pradhana Archaka on Honorary basis.

* Resolved to file a Criminal defamation suit against a vernacular paper for Rs.100crore for publishing false news which affected the sentiments of millions of devotees.

* Agreed for deployment of a DSP level officer to monitor the Cyber Security Wing in TTD.

* Dr Madan Mohan Reddy, renowned Orthopedic Surgeon working in Apollo, Chennai, has been appointed as Director for BIRRD Ortho Hospital run by TTD in Tirupati on Honorary basis.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

డిసెంబరు 2019, తిరుమ‌ల 28: టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం శ‌నివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. స‌మావేశం అనంత‌రం టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

–       జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాద‌శి, 7న ద్వాద‌శి సంద‌ర్భంగా రెండు రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పిస్తాం. ప్రోటోకాల్ ప్ర‌ముఖుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తాం. వీలైనంత ఎక్కువ మంది సామాన్య భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తాం.

–       2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను టిటిడి రూ.3,116.25 కోట్లతో అంచనా బడ్జెట్‌ను రూపొందించగా, రూ.3,243.19 కోట్లుగా సవరించడమైనది. ఇందులో శ్రీవారి హుండీ ఆదాయాన్ని రూ.1,231 కోట్లుగా అంచనా వేయగా, రూ.1,285 కోట్లు సమకూరింది. అదేవిధంగా ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.270 కోట్లు అంచనా వేయగా రూ.330 కోట్లు ఆదాయం లభించింది.

–       ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం వార‌ణాశితోపాటు జ‌మ్మూలో శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణానికి సూత్ర‌ప్రాయంగా అంగీకారం. స్థ‌లం కేటాయింపు కోసం ఆ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు లేఖ రాయాల‌ని నిర్ణ‌యం.

–       ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో రూ.30 కోట్లతో శ్రీవారి ఆలయం, టిటిడి సమాచార కేంద్రం నిర్మాణానికి ఆమోదం.

–      డిఎస్‌పి స్థాయి అధికారితో ప్ర‌త్యేకంగా సైబ‌ర్ సెక్యూరిటీ విభాగం ఏర్పాటుకు ఆమోదం.

–       శ్రీ ర‌మ‌ణ దీక్షితులకు గౌ..ప్ర‌ధానార్చ‌కులు(honarary basis) హోదా క‌ల్పిస్తూ నిర్ణ‌యం.

–       టిటిడిలో ప్ర‌త్యేక అకౌంటింగ్ విభాగం ఏర్పాటుకు నిర్ణ‌యం.

–      భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా క‌థ‌నం ప్ర‌చురించిన ఒక ప‌త్రిక‌పై రూ.100 కోట్ల‌తో క్రిమిన‌ల్ ప‌రువు న‌ష్టం దావా వేసేందుకు నిర్ణ‌యం.

–      రూ.14 కోట్ల అంచనా వ్యయంతో తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయ విమానానికి రాగిరేకులపై బంగారు తాపడం పనులు చేపట్టేందుకు  ఆమోదం. ఇందుకు అవసరమైన బంగారాన్ని టిటిడి ఖజానా నుండి తీసుకునేందుకు అనుమతి.

–       చెన్నై అపోలో ఆసుప‌త్రిలో ప‌నిచేస్తున్న డా. మ‌ద‌న్‌మోహ‌న్‌రెడ్డిని బ‌ర్డ్ ఆసుప‌త్రి డైరెక్ట‌ర్‌(honarary basis)గా నియ‌మిస్తూ నిర్ణ‌యం.

–       తిరుపతిలోని శ్రీ పద్మావతి, శ్రీ శ్రీనివాస కల్యాణమండపాల్లో సెంట్రలైజ్డ్ ఏసి ఏర్పాటుకు రూ.3.20 కోట్లతో పనులు చేపట్టేందుకు ఆమోదం.

–       తిరుమల-తిరుపతి రెండో ఘాట్‌ రోడ్డులో రూ.10 కోట్ల వ్యయంతో ఆర్‌సిసి క్రాష్‌ బ్యారియర్లు, సిసి కెర్బ్‌ వాల్స్‌ నిర్మాణానికి ఆమోదం.

–       తిరుమల ఘాట్‌ రోడ్లలో మరమ్మతులు చేప‌ట్టేందుకు గాను ఐఐటి చెన్నై, జెఎన్‌టియు నిపుణుల క‌మిటీ ఏర్పాటుకు నిర్ణ‌యం.

–       తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో రూ.14.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆమోదం.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.