GUV OFFERS PRAYERS IN TTD LOCAL TEMPLES_ టిటిడి స్థానికాలయాలను దర్శించుకున్న తెలుగు రాప్ట్రాల గవర్నర్
Tirupati, 13 Jul. 19: The Governor of AP and TS Sri ESL Narasimhan offered prayers in all the TTD local temples on Saturday.
Beginning his spiritual visit to the temple city, the first citizen of the state had darshan of Sri Padmavathi Ammavaru at Tiruchanoor.
The priests gave him traditional reception on his arrival at temple. Tirupati JEO Sri P Basanth Kumar welcomed the VIP protocol dignitary. The Governor and his entourage had darshan of Goddess.
TAKES PART IN JYESTABHISHEKA HOMAM AT GT
Later the Honourable Governor along with his spouse Smt Vimala Raman had darshan of Sri Govinda Raja Swamy in Tirupati. They also had darshan of Sri Andal Ammavaru, Sri Kalyana Venkateswara, Sri Bhashyakarulavaru, and Sri Tirumala Nambi sub temples located in the main temple premises.
The Governor and Lady Governor later took part in the Jyestabhisheka Homam, which is going on in the temple.
PRAYS IN KRT
Afterwards, the first citizen couple of the State had darshan of Sri Kodanda Rama Swamy in Tirupati.
The Governor said Lord Sri Rama is an embodiment of ethical values and righteousness and hence revered as “Maryada Purushottama”.
VISITS SKVST
Later HE the Honourable Governor Sri ESL Narasimhan paved a visit to Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram, which is about 15km from Tirupati.
Collector Sri Narayana Bharat Gupta, Tirupati Urban SP Sri Anburajan, TTD CVSO Sri Gopinath Jatti, VGO Sri Ashok Kumar Goud, Spl.Gr DyEO Smt Varalakshmi, DyEO Smt Jhansi Rani and other officers were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
టిటిడి స్థానికాలయాలను దర్శించుకున్న తెలుగు రాప్ట్రాల గవర్నర్
తిరుపతి, 2019 జూలై 13: తెలుగు రాప్ట్రాల గవర్నర్ గౌ|| శ్రీ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ దంపతులు శనివారం ఉదయం తిరుచానూరు, తిరుపతి, శ్రీనివాసమంగాపురంలోని టిటిడి స్థానికాలయాలను దర్శించుకున్నారు. ఆయా ఆలయాల అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్న గౌ|| గవర్నర్ దంపతులకు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వి.బి.ఝాన్సీరాణి, అర్చకులు కలిసి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గౌ|| గవర్నర్ దంపతులకు అమ్మవారి శేష వస్త్రాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా గౌ|| గవర్నర్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ భరత్ గుప్తా, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి , సబ్ కలెక్టర్ శ్రీ మహేష్ కుమార్, అర్బన్ ఎస్పీ శ్రీ అన్బురాజన్, ఆలయ ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం వద్దకు చేరుకున్న తెలుగు రాప్ట్రాల గవర్నర్ గౌ|| శ్రీ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ దంపతులకు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్, ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పి.వరలక్ష్మీ, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ పార్థసారథి స్వామివారిని , శ్రీ ఆండాళ్ అమ్మవారిని , శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. జ్యేష్ఠాభిషేకంలో భాగంగా మండపంలో జరిగిన హోమంలో గౌ|| గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. అద్దాలమండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి వస్త్రం, ప్రసాదాలు అందించారు. అనంతరం శ్రీ తిరుమలనంబి , శ్రీ భాష్యకార్ల సన్నిధి , శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి విఎస్‌వో శ్రీ అశోక్ కుమార్ గౌడ్ , ఈఈ శ్రీ మనోహరం, డిఈ (ఎలక్ట్రికల్ ) శ్రీ చంద్రశేఖర్, ఆలయ ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, ఏవీఎస్వో శ్రీ నందీశ్వర్ రావు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్న తెలుగు రాప్ట్రాల గవర్నర్ గౌ|| శ్రీ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ దంపతులకు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేసి వస్త్రం, ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా గౌ|| గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ శ్రీరామచంద్రుడు కోరిన కోరికలు తీర్చే దేవుడని, దేశప్రజలందరికీ సుఖసంతోషాలు ప్రసాదించాలని ప్రార్థించానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పి.వరలక్ష్మీ, ఏఈవో శ్రీ తిరుమలయ్య, డిఈ (ఎలక్ట్రికల్ ) శ్రీ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రమేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ గౌ|| శ్రీ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ దంపతులకు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేసి వస్త్రం, ప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ లక్ష్మయ్య, సూపరింటెండెంట్లు శ్రీ ముని చెంగల్రాయులు, శ్రీ రమణయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ అనిల్‌కుమార్, శ్రీ యోగానందరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.