TANNIRMUDU FESTIVAL AT SRIVARI TEMPLE_ డిసెంబరు 31న తిరుమలలో తన్నీరముదు ఉత్సవం
Tirumala, 24 Dec. 18: A festival in honour of devotee par excellence of Lord Venkateswara, Sri Thirumala Nambi will be celebrated at Srivari temple on December 31, as Tannirmudu festival as a concluding event of Adhyanotsavam which commenced from December 7.
As per Temple traditions to honour the favourite devotees of Lord, 22nd day of Adhyayanotsavam is heralded as Kanniman Thiruttamb day as Sri Ramanuja Matrandi day, 4th day as Sri VarahaSwamy Sattumora and 26th day as Tannirmudu festival.
As part of the event descendants of Thirumala Nambi will carry pits of holy water from Akashaganga to Vahana mandapam. Alingwith Jeeyars, Archakas and Vedic pundits they entering Srivari temple and perform. Abhisekam to lords gold studded lotus feet while reciting Tirumozhi pashuras, penned by devotee Thirumala Nambi.
Legends say that Thirumala Nambi, maternal uncle of Sri Ramanujacharya born in 973 AD brought Abhisekam water for Srivari Temple from Papavinasam every day. One day he met Lord on way but refused to give water that put a hole in the water pit. Later Lord created a pi day in the nearby hillock, which is known as Akashi Ganga and its sweet water, is known as Tannirmudu.
Sri Ramanujacharya started the festival 1000 years ago as a tribute to services of Thirumala Nambi also known as Thatacharyas. Since then Nambi ancestors participated in this event held with austerity in the Srivari temple.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
డిసెంబరు 31న తిరుమలలో తన్నీరముదు ఉత్సవం
తిరుమల, 24 డిసెంబరు 2018: శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీ వేంకటేశ్వరుని సేవలోనే తన జీవితాన్ని అర్పించిన మహనీయుడైన శ్రీ తిరుమలనంబిని స్మరించుకుంటూ ప్రతి ఏడాదీ నిర్వహించే తిరుమలనంబి ”తన్నీరముదు” ఉత్సవం డిసెంబరు 31వ తేదీన తిరుమలలో ఘనంగా జరుగనుంది. శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు సందర్భంగా తన్నీరముదు ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. డిసెంబరు 7న ప్రారంభమైన అధ్యయనోత్సవాల్లో భాగంగా 22వ రోజున కణ్ణినున్ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున తన్నీరముదు ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు ఆలయ ప్రదక్షిణంగా వాహనమండపానికి వేంచేపు చేస్తారు. తిరుమలనంబి ఆలయం నుండి ప్రదక్షిణంగా తిరుమలనంబి వంశీకులు శిరస్సుపై బిందెల్లో ఆకాశగంగ తీర్థాన్ని వాహనమండపానికి తీసుకొస్తారు. అక్కడినుండి వేదమంత్రోచ్ఛారణ నడుమ జీయర్ స్వాములు, ఆచార్య పురుషులు, ప్రబంధ పండితులు పవిత్ర తీర్థ జలంతో ఆలయంలోనికి వేంచేపు చేస్తారు. అనంతరం తిరుమలనంబి వంశీకులు స్వామివారి మూలవిరాట్టు పాదాలపై అమరి ఉన్న బంగారు తొడుగునకు పవిత్ర ఆకాశగంగ జలంతో అభిషేకం చేస్తారు. ఈ సందర్భంగా వైదికులు తిరుమలనంబి రచించిన ”తిరుమొళి పాశురాలను” పారాయణం చేస్తారు.
పౌరాణిక ప్రాశస్త్యం :
పౌరాణిక ప్రాశస్త్యం మేరకు శ్రీ తిరుమలనంబి క్రీ.శ. 973వ సంవత్సరంలో పవిత్ర పురట్టాసి మాసంలో అనూరాధ నక్షత్రంలో జన్మించారు. వీరు సాక్షాత్తు శ్రీ భవగవత్ రామానుజాచార్యులవారికి మేనమామ. ప్రతిరోజూ పాపవినాశతీర్థం నుండి కుండలో నీరు తీసుకొచ్చి శ్రీవారి ఆలయంలో స్వామివారికి దైనందిన పాదపూజ నిర్వహించేవారు. ఒకరోజు తిరుమలనంబి యధాప్రకారం స్వామివారి సేవ కోసం పాపవినాశనం నుండి జలాన్ని కుండలో మోసుకొని వస్తుండగా సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వేటగాని రూపంలో వచ్చి నంబిని ”తాతా” (అయ్యా) అని పిలుస్తూ దాహం తీర్చుకోవడానికి ఆ బిందెలోని నీటిని కోరాడు. తిరుమలనంబి ఇవ్వకపోవడంతో బిందెకు రంధ్రం చేసి ఆ నీటిని తాగి వేటగాని రూపంలో ఉన్న స్వామి సంతృప్తి పొందాడు. ఈ చర్యతో ఖిన్నుడైన తిరుమలనంబిని చూసి స్వామి ఓదార్చుతూ సమీపంలో ఉన్న కొండపై బాణం వేసి అందులోనుండి తీయని పానీయం వచ్చేలాగా చేసాడు. నంబిని ఉద్దేశించి స్వామి మాట్లాడుతూ ”ఇకపై ఈ తీర్థ జలాన్నే నాసేవకు ఉపయోగించాలని పలికి” అంతర్థానమయ్యారు. అప్పుడు తనకు ప్రత్యక్షమైన వ్యక్తి సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామివారేనని తిరుమలనంబి గ్రహించి ఎంతో ఆనందం చెందాడు. అప్పటి నుండి ఈ తీర్థానికి ఆకాశగంగ అనే పేరు వచ్చింది. ఈ తీర్థం నీళ్లు తీపిగా, అమృతమయంగా ఉండడంతో ”తన్నీరముదు” అని కూడా వ్యవహరించడం జరిగింది.
భగవత్ శ్రీ రామానుజాచార్యులవారు సుమారు 1000 సంవత్సరాల క్రిందట శ్రీవారి ఆలయంలో తన్నీరముదు ఉత్సవాన్ని తిరుమలనంబి స్వామివారికి అందించిన విశేషసేవల జ్ఞాపకార్థం ప్రవేశపెట్టారు. అప్పటినుండి తిరుమలనంబి(తాతాచార్య) వంశస్థులు ప్రతి ఏడాదీ తిరుమలలో ఈ ఉత్సవాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.