GRAND ANKURARPANAM FETE AT SRI GT _ శ్రీ గోవిందరాజస్వామి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Tirupati,20 May 2023: Ankurarpanam was performed on Saturday evening as part of the ongoing Maha Samprokshana program held at Sri Govindarajaswami temple in Tirupati. Acharya Ritwik Varanam was observed in the day between 7.30am and 9am.

 

Earlier the procession of Sri Viswaksena was held on the Mada streets followed by Mrutsangrahanam and Ankurarpanam performed as per Vaikhanasa Agama traditions.

 

Preparations are underway to conduct rituals of Jeernodharana and Maha Samprokshana at Sri Govindarajaswami temple marking the completion of gold plating works of temple Vimana Gopuram.

 

Both the Senior and Junior Pontiffs of Tirumala, FACAO Sri Balaji, DyEO Smt Shanti, AEO Sri Ravi Kumar, Chief priest Sri Srinivasa Dikshitulu and other staff were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి, 2023 మే 20: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మే 21 నుండి 25వ తేదీ వ‌ర‌కు మ‌హాసంప్రోక్ష‌ణ జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. ఉదయం 7.30 గంటల నుండి 9 గంటల వరకు ఆలయంలో ఆచార్య ఋత్విక్ వ‌ర‌ణం నిర్వహించారు.

సాయంత్రం 6.30 గంటలకు శ్రీ విష్వ‌క్సేనుల వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వ‌హించారు. అనంతరం ఆల‌యంలో మృత్సంగ్ర‌హ‌ణం, వైఖానస ఆగమోక్తంగా అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. .

శ్రీగోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం ప‌నులు పూర్తి కావ‌డంతో జీర్ణోద్ధ‌ర‌ణ, మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేప‌ట్టారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ రవి కుమార్, ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ నారాయణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రాధా కృష్ణ, అర్చక బృందం పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.