GRAND ANKURARPANAM OF SRI GT BALALAYAM FETE _ శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో బాలాల‌యానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ

Tirupati, 08 September 2021: TTD organized grand Ankurarpanam on Wednesday evening for the five-day Balalaya fete at the Sri Govindaraja Swamy temple.

TTD JEO Smt Sada Bhargavi participated in the Acharya Ritwik Varanam ritual.

Speaking on the occasion the JEO said all arrangements were made for gold lacing of temple Vimanam with 100 kg of gold. TTD is undertaking the gold lacing works on copper plates of the Vimana Gopuram of Sri Govindaraja Swamy temple from September 14 after the Balalayam from September 9-13.

The JEO said the Balalayam program will be observed at the temple Yagashala. Balalaya Samprokshana fete will be conducted in the Tula Lagnam on September 13 between 9.40am and 10am.

Later in the evening of Wednesday Ankurarpanam was performed.

Temple Special Grade DyEO Sri Rajendudu, VSO Sri Manohar, Temple Chief Archaka Sri P Srinivasa Dikshitulu, Agama Advisor Sri Vedantam Vishnu Bhattacharyulu and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో బాలాల‌యానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ

ఆచార్య రుత్విక్‌వ‌ర‌ణంలో పాల్గొన్న జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

తిరుప‌తి, 2021 సెప్టెంబ‌రు 08: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 9 నుండి 13వ తేదీ వరకు జ‌రుగ‌నున్న బాలాలయం కార్యక్రమానికి బుధ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. సెప్టెంబ‌రు 14వ తేదీ నుండి ఆల‌యంలో విమాన గోపురానికి రాగి రేకుల‌పై బంగారు తాప‌డం ప‌నులు ప్రారంభ‌మ‌వుతాయి.

ఇందులో భాగంగా సాయంత్రం 5.30 గంటల నుండి సేనాధిప‌తి వారిని విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వ‌హించి మృత్సంగ్ర‌హ‌ణం చేప‌ట్టారు. ఆ త‌రువాత యాగ‌శాల‌లో అంకురార్పణ కార్య‌క్ర‌మాలు నిర్వహించారు.

ఉద‌యం 9.30 నుండి 10.30 గంటల వ‌రకు జరిగిన ఆచార్య రుత్విక్ వ‌ర‌ణం కార్య‌క్ర‌మంలో టిటిడి జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ 100 కిలోల బంగారంతో ఆల‌య విమాన గోపురానికి బంగారు తాప‌డం ప‌నులు చేప‌ట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామ‌న్నారు. ఋత్వికుల‌కు విధుల కేటాయింపునే ఆచార్య ఋత్విక్‌వరణం అంటార‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఋత్వికుల‌కు వ‌స్త్రస‌మ‌ర్ప‌ణ చేశామ‌న్నారు. సెప్టెంబ‌రు 9 నుండి 13వ తేదీ వ‌ర‌కు యాగ‌శాల‌లో బాలాల‌య కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయ‌ని చెప్పారు. సెప్టెంబ‌రు 13న ఉద‌యం 9.40 నుండి 10 గంట‌ల మ‌ధ్య తులా ల‌గ్నంలో బాలాల‌య సంప్రోక్ష‌ణం చేప‌డ‌తామ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ పి.శ్రీ‌నివాస దీక్షితులు, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, ఎఈవో శ్రీ ఎం.ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ ఎ.నారాయ‌ణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ ఎ.కామ‌రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.