GRAND CONCLUSION OF SRI GT FLOAT FESTIVAL_ ఘనంగా ముగిసిన శ్రీగోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

Tirupati, 19 Feb. 19: The five day annual flat festival (Teppotsavam) of Sri Govindaraja Temple concluded with grand performing of special pujas on Tuesday evening.

As part of festivities snapana Thirumanjanam was performed to the utsava deities in the morning and taken around the Pushkarani in the flat in the evening for seven rounds. Thereafter the deities of Sridevi, Bhudevi and Sri Govindaraja Swamy were taken in a procession on the Mada streets.

The artists of HDPP, and Annamacharya project presented bhajans and Bhakti sangeet programs on the occasion.

Spl. Grade DyEO Smt Varalakshmi, AEO Sri Udaya bhaskar Reddy, Temple Supdt Sri Srihari, temple inspector Sri Krishna murthy other officials participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఘనంగా ముగిసిన శ్రీగోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతి, 2019 ఫిబ్రవరి 19: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పుష్కరిణిలో ఏడు రోజుల పాటు జరిగిన స్వామివారి తెప్పోత్సవాలు మంగ‌ళ‌వారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు తెప్పలపై విహరించనున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు. చివరి రోజు స్వామివారు మొత్తం ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమివ్వనున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీహరి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.