POURNAMI GARUDA SEVA OBSERVED_ తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

Tirumala, 19 Feb. 19: The monthly Pournami Garuda Seva was observed by TTD in Tirumala on Tuesday evening.

The processional deity of Sri Malayappa Swamy varu took out a celestial ride Garuda Vahanam between 7pm and 9pm.

Devotees thronged four mada streets to have darshanam of Lord on Garuda Vahanam.

AP Minister Sri Adinarayana Reddy, Tirumala JEO Sri KS Sreenivasa Raju, Board Members Sri Rudraju Padmaraju, GSS Sivaji, CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh and others took part.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

ఫిబ్ర‌వ‌రి 19, తిరుమల 2019: తిరుమలలో మంగ‌ళ‌వారం రాత్రి పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీమలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణకాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. కాగా గరుడసేవ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల నాలుగుమాఢ వీధులు గోవిందనామ స్మరణతో మార్మోగాయి.

శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరినీ క‌టాక్షించాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ కార్యక్రమంలో టిటిడి అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.