GRAND KUPUCHANDRAPET UTSAVA OF SRI KODANDARAMA SWAMY _ ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం

Tirupati, 28 Feb. 21: As part of traditional gramotsavam at Kupuchandrapeta village, the grand procession of utsava idols of Sri Sita Lakshmana Sameta Kodandarama Swamy was held on Sunday.

The idols were brought to the village, which is 8 kms away from Tirupati in a procession, and Snapana Tiirumanjanam was performed in the noon.

Thereafter Unjal seva and and Gramotsava were conducted in the evening before returning the idols to Sri Kodandarama Swamy temple.

As per age-old practice every year on the Pournami day of Magha masa, the utsava idols of Sri Kodandarama Swamy temple are being brought to the Kupuchandrapeta village to participate in the Gramotsava festivities of the village.

The artists of the HDPP and Dasa Sahitya project presented bhajans, kolatas and cultural programs in the procession.

The Special Grade DyEO Smt Parvati, AEO Sri Durga Raju, Superintendent Sri Ramesh and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం

తిరుపతి, 2021 ఫిబ్రవరి 28: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం ఆది‌వారం ఘనంగా జరిగింది. మాఘపౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీ.

ఉదయం 5 గంటలకు ఆలయం నుండి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఊరేగింపు బయల్దేరింది. ఉదయం 10 గంటలకు తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు చేరుకుంది. అక్కడ ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం చేశారు.

అనంతరం సాయంత్రం 4.00 నుంచి 5.00 గంటల వరకు ఊంజల్‌సేవ చేపడతారు. సాయంత్రం 5.00 గంటలకు గ్రామోత్స‌వం నిర్వ‌హించి, ఆలయానికి చేరుకుంటారు.

ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగిన స్వామివారి ఊరేగింపులో టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి పార్వ‌తి, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మేష్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.