KAT PERFORMED AT SRI KT _ శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 28 Feb. 21: As part of traditional practice, TTD on Sunday organised the holy Koil Alwar Tirumanjanam ritual at Sri Kapileswara Swamy Temple in Ekantham ahead of the ensuing annual Brahmotsavams from March 4 to 13.

After morning rituals of Suprabatham and Abhisekam, the holy temple cleansing exercise commenced at 11am and lasted till 2.30pm and later Sarva Darshan commenced for devotees.

Temple DyEO Sri Subramanyam, Temple Superintendent Sri Bhupathi Raju and temple inspector Sri Reddy Sekhar were present in the cleansing ritual.

The annual Brahmotsavam will be conducted in Ekantham inside the temple as per Covid guidelines and the Ankurarpanam will be observed on March 3 evening to kick start the nine day long festival.

Following is the schedule of Vahana Sevas of the Brahmotsavam observed both morning and evening.

04-03-2021(Thursday)

Dhwajarohanam in the auspicious Meena lagnam) – Hamsa vahana 

05-03-2021(Friday) Surya Prabha vahana and Chandra Prabha vahana 

06-03-2021(Saturday) Bhuta vahana and Simha vahana 

07-03-2021 (Sunday) Makara vahana and Sesha Vahana

08-03-2021(Monday)          

Tiruchi utsavam and Adhikara Nandi Vahana 

09-03-2021 (Tuesday) Vyaghra vahana and Gaja Vahana 

10-03-2021(Wednesday) Kalpavruksha vahana and Aswa Vahana

11-03-2021(Thursday) Rathotsavam (bhogi theru) and Nandi Vahana 

12-03-2021(Friday) Purushamruga Vahana, Kalyanotsavam and Tiruchi utsava 

13-03-2021(Saturday)

Sri Natarajaswami Utsavam on Surya Prabha vahana, Trishula Snanam, Dwajavarohanam and Ravanabrahma Vahanam.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2021 ఫిబ్రవరి 28: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. మార్చి 4 నుండి 13వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగనున్నాయి.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయం, ధ్వజస్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఏకాంతంగా శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 4 నుండి 13వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను కోవిడ్ -19 నేప‌థ్యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు. మార్చి 3వ తేదీ సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

04-03-2021(గురువారం) ధ్వజారోహణం(మీన‌లగ్నం) హంస వాహనం

05-03-2021(శుక్ర‌‌వారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

06-03-2021(శ‌నివారం) భూత వాహనం సింహ వాహనం

07-03-2021(ఆది‌వారం) మకర వాహనం శేష వాహనం

08-03-2021(సోమ‌‌వారం) తిరుచ్చి ఉత్సవం అధికారనంది వాహనం

09-03-2021(మంగ‌ళ‌వారం) వ్యాఘ్ర వాహనం గజ వాహనం

10-03-2021(బుధ‌వారం) కల్పవృక్ష వాహనం అశ్వవాహనం

11-03-2021(గురు‌వారం) రథోత్సవం(భోగితేరు) నందివాహనం

12-03-2021(శుక్ర‌వారం) పురుషామృగవాహనం కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం

13-03-2021(శ‌నివారం) శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం,

సూర్యప్రభ వాహనం, త్రిశుల స్నానం. ధ్వజావరోహణం.

ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.