GRAND PROCESSION OF VAHAHANAMS AT NARAYANAVANAM _ సప్తవాహనాలపై ఊరేగి భ‌క్తులకు ద‌ర్శ‌న‌మిచ్చిన శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

Narayanavanam , 01 Feb 20 ; On the auspicious occasion of Radha Sapthami, Sri Kalyana Venkateswara Swamy took out celestial ride on a series of vahanams on Saturday at Narayanavanam temple.

The deity blessed the devotees on Suryaprabha, Hamsa, Chinnasesha, Kalpavriksha, Peddasesha, Tiruchi and Chandraprabha vahanams from morning to evening.

DyEO Smt Shanti, AEO Sri Durgaraju and others participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPAT

సప్తవాహనాలపై ఊరేగి భ‌క్తులకు ద‌ర్శ‌న‌మిచ్చిన శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

తిరుపతి, 2020 ఫిబ్ర‌వరి 01: సూర్యజయంతిని పురస్కరించుకొని నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ర‌థ‌స‌ప్త‌మి పర్వదినాని శ‌నివారం అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఉదయం సూర్యుని కిర‌ణాలు సూర్యప్రభ వాహనంలో కొలువైన స్వామి, అమ్మ‌వార్ల‌పై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనందపరవశులయ్యారు.

ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు సూర్యప్రభ, హంస, చిన్నశేష, కల్పవృక్ష, పెద్దశేష వాహన సేవలు, తిరుచ్చి ఉత్సవం నిర్వ‌హించారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచారపరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో  భజన బృందాలు పాల్గొన్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి శాంతి, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి హ‌రిప్రియ‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.