RELIGIOUS FERVOUR MARKS NAGALAPURAM RADHASAPTHAMI _ టిటిడి స్థానిక ఆలయాలలో వైభ‌వంగా రథసప్తమి

Naglapuram ,01 Feb 20 ; In a colourful and spiritual event, Radhasapthami was observed with religious fervour in Sri Vedanarayana Swamy temple at Nagalapuram in Chittoor district on Saturday.

The series of vahana sevas commenced with Suryaprabha Vahanam followed by Hamsa, Tiruchi, Kalpavriksha, Sesha and Chandraprabha vahanams.

DyEO Smt Shanti, AEO Sri Durgaraju, Temple Inspector Sri Nandakumar and others participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

 

టిటిడి స్థానిక ఆలయాలలో వైభ‌వంగా రథసప్తమి
 
తిరుపతి, 2020 ఫిబ్ర‌వరి 01: టిటిడి అనుబంధ ఆల‌యాలు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, న‌గ‌రిలోని శ్రీక‌రియ‌మాణిక్య‌స్వామివారి ఆల‌యం, స‌త్ర‌వాడ‌లోని శ్రీ క‌రివ‌ర‌ద‌రాజ‌స్వామివారి ఆల‌యాల్లో రథసప్తమి పర్వదినాని శ‌నివారం అత్యంత‌ వైభంవ‌గా నిర్వ‌హించారు.

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో….
 
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.00 నుండి 7.30 గంటల వరకు స్వామి, అమ్మ‌వార్లు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు.
     
కాగాసాయంత్రం 4.00 నుండి 5.00 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌లసేవ‌, సాయంత్రం 5.00 నుండి 6.00 గంట‌ల వ‌ర‌కు ఉత్సవం ఘనంగా నిర్వ‌హించ‌నున్నారు.
 
ఈ కార్యక్రమంలో టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీ‌నివాసులు, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో….

కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఉద‌యం 6.30 నుండి 8 గంటల వరకు స్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి 8.00 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల‌సేవ నిర్వ‌హించ‌నున్నారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి శాంతి, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, సూప‌రింటెండెంట్ శ్రీ‌ర‌మేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కుమార్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

న‌గ‌రిలోని శ్రీ క‌రియ‌మాణిక్య‌స్వామివారి ఆల‌యంలో ……

న‌గ‌రిలోని శ్రీ క‌రియ‌మాణిక్య‌స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 9 నుండి 10.30 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌రియ మాణిక్య‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం వైభ‌వంగా జ‌రిగింది. సాయంత్రం 6 నుండి 8 గంట‌ల వ‌ర‌కు ఆర్జిత క‌ల్యాణోత్స‌వం నిర్వ‌హిస్తారు.

స‌త్ర‌వాడ‌లోని శ్రీ క‌రివ‌ర‌ద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో…..
        
స‌త్ర‌వాడ‌లోని శ్రీ క‌రివ‌ర‌ద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు సూర్య‌ప్ర‌భ వాహ‌నం ఊరేగి భక్తులను కటాక్షించారు. కాగా సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌ప్ర‌భ వాహ‌నం గ్రామోత్స‌వం చేప‌డ‌తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.