GRAND SHOBHA YATRA OF BHAJAN MANDALS _ వైభవంగా భజనమండళ్ల శోభాయాత్ర

Tirupati, 8 Jan. 20: The three day Trimasika Metlotsavam event organised by the TTD Dasa Sahitya Project kicked off in a grand manner on Wednesday evening with the Shoba Yatra of bhajan mandals.

As a part of the program, the bhajan mandals performed suprabatham, dhyanam and Bhakti bhajans at second chowltry. 

The Sobha Yatra commenced after special puja to srivari prajachara ratham at Sri Govindaraja swamy temple in the evening.

Speaking on the occasion special officer of Dasa Sahitya Project Sri Anandathirtha charyulu said over 3000 bhajan mandali members from Andhra Pradesh, Telangana, Karnataka, Tamil Nadu and Kerala are taking part. He said the Shoba Yatra with bhajans and kolatas will reach choultries from Sri Govindarajaswamy temple.

He said the holy ritual of metlotsavam would be performed at the Padala mandapam on January 10 after special pujas. The entire posse of bhajan mandal members will climb the Tirumala thereafter singing bhajans and sankeertans, he said.

Spl.Gr.DyEO of Sri Govindarajaswamy temple Smt Varalakshmi, superintendent Sri Raja Kumar and others participated.

NAMASMARANA FOR UNIVERSAL WELL-BEING- SEER

HH Sri Sri Sri Suvidyendratirtha swamiji of Sri Raghavendra Swamy Mutt,  Bengaluru, has advocated that Srinivasa Namasmara would promote well being of entire universe.

Participating in the inaugural session of  of Trimasika Metlotsavam organised by Dasa Sahitya project of TTD in the Third  choultry in Tirupati on Wednesday evening,  the pontiff lauded the efforts of TTD in organising the event in which thousands of bhajan mandal members chanted the sankeertans of Purandara Dasa and other kannada saint- poets.

More than 3000 bhajan mandal members  from all four southern states and Maharastra participated in the program organised under aegis of Dasa Sahitya Project Special Officer Sri Anandathirthacharyulu.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

వైభవంగా భజనమండళ్ల శోభాయాత్ర
 
తిరుప‌తి, 08 జ‌న‌వ‌రి 2020: టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనమండళ్ల శోభాయాత్ర బుధ‌వారం సాయంత్రం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరుగనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
 
ఇందులో భాగంగా తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనక వైపు గల మూడో సత్ర ప్రాంగణంలో ఉదయం 5 నుండి 7 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు భజన మండలి సభ్యులకు కొత్త సంకీర్తనలు నేర్పడం, ధార్మిక సందేశం, మానవాళికి హరిదాసుల ఉపదేశాలు అందించారు.
 
సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద శ్రీవారి ప్రచారరథంలోని స్వామివారికి పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, తమిళనాడు, కర్ణాటక, కేర‌ళ రాష్ట్రాల నుండి 3 వేల మంది భజనమండళ్ల సభ్యులు శోభాయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి భజనలు, కోలాటాలతో శోభాయాత్ర రైల్వేస్టేషన్‌ వెనకవైపు గల మూడో సత్రం ప్రాంగణానికి చేరుకుంటుందన్నారు. జ‌న‌వ‌రి 10వ తేదీ శుక్ర‌వారం ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాలమండపం వద్ద ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తామన్నారు. అక్కడినుంచి భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేస్తూ తిరుమలకు చేరుకుంటారని తెలిపారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌య ప్రత్యేక శ్రేణి డెప్యూటి ఈఓ శ్రీమతి వరలక్ష్మి, సూప‌రింటెండెంట్ శ్రీ రాజ్ కుమార్, భ‌జ‌న మండ‌ళ్ల స‌భ్యులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.