GODDESS KAMAKSHI RIDES FLOAT _ తెప్ప‌ల‌పై శ్రీ కామాక్షి అమ్మ‌వారి విహారం

Tirupati, 8 Jan. 20: On the fourth day of ongoing float festival (Teppotsavam) at Sri Kapileswara Swamy temple, the utsava deity of Goddess Kamakshi has taken ride on colourfully decorated float.

Riding the flower and electrically decked float, the deity blessed devotees by taking seven rounds in the temple Pushkarani.

Similarly on January 9, the utsava idols of Sri Chandikeswara and Sri Chandrasekhar will bless devotees in nine rounds on the float.

ARUDRA DARSHAN MAHOTSAVAM ON JANUARY 10

As a part of Arudra Darshana Mahotsavam at Sri Kapileswara temple, the utsava idols of Sri Nataraja and Goddess Sri Shivagami, besides Sri 

Manikyavasa will be taken out on a procession in Tirupati.

DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupathi and other officials participated.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

 

 

తెప్ప‌ల‌పై శ్రీ కామాక్షి అమ్మ‌వారి విహారం

తిరుప‌తి, 08 జ‌న‌వ‌రి 2020: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న తెప్పోత్సవాల్లో నాలుగో రోజైన బుధ‌వారం సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మ‌వారు తెప్ప‌ల‌పై విహ‌రించి భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు అమ్మ‌వారు ఏడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు ఆలపించారు.

అదేవిధంగా గురువారం  శ్రీ చండికేశ్వరస్వామివారు మ‌రియు శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పలపై 9 చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు.

జ‌న‌వ‌రి 10న ఆరుద్ర ద‌ర్శ‌న మ‌హోత్స‌వం

శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో జనవరి 10వ తేదీన ఆరుద్ర దర్శన మహోత్సవం సందర్భంగా ఉదయం 5.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు, శ్రీ శివగామి అమ్మవారు, శ్రీ మాణిక్యవాసగ స్వామివారి ఉత్సవమూర్తుల‌ను పురవీధులలో ఊరేగించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.