GURUPUJOTSAVAM IN MAHATI ON SEP 5_ సెప్టెంబరు 5న మహతిలో గురుపూజోత్సవం

Tirupati, 4 September 2017: In connection with Teachers’ Day, Gurupujotsavam will be observed in Mahati Auditorium by TTD education wing on Tuesday.

As a part of it there will be lecture by scholarly persons for both students and faculty from 9:30am onwards.

About 700 teachers and 500 pupils belonging to TTD-run educational institutions take part in this fete.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

సెప్టెంబరు 5న మహతిలో గురుపూజోత్సవం

సెప్టెంబర్‌ 04, తిరుపతి, 2017: టిటిడి ఆధ్వర్యంలో సెప్టెంబరు 5వ తేదీన తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గురుపూజోత్సవం ఘనంగా జరుగనుంది.

ఉదయం 9.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముందుగా టిటిడి విద్యాసంస్థలకు చెందిన ఉపాధ్యాయులకు వేదాశీర్వచనం ఉంటుంది. ఈ సందర్భంగా ”ఆధ్యాత్మిక చింతన, నడవడిక” అనే అంశంపై విద్యార్థులకు, ”ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు ఎలా అవగాహన కల్పించాలి” అనే అంశంపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు.

తిరుమల, తిరుపతిలోని టిటిడి విద్యాసంస్థలకు చెందిన 700 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వివిధ కోర్సుల్లో ఆఖరు సంవత్సరం చదువుతున్న 500 మంది విద్యార్థులు పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.