SERIES OF RELIGIOUS EVENTS IN KRT IN SEPTEMBER_ సెప్టెంబరులో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 4 September 2017: The ancient temple of Sri Kodanda Rama Swamy is gearing up of series of religious events in the month of September.

The special abhishekam will be performed to the presiding deity on Saturdays on 9,16,23 and 30 of September while in the evening Unjal Seva will be performed.

On September 6, there will be Astottara Sata Kalasabhishekam while on September 15 in connection with Punarvasu star Sri Sita Rama Kalyanam will be performed at 11am and Tiruchi vahanam at 5:30pm.

On September 20, Sahasra Kalasabhishekam will be observed in the morning and Hanumantha Vahanam in the evening.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

సెప్టెంబరులో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

సెప్టెంబర్‌ 04, తిరుపతి, 2017 : తిరుపతిలో టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ కోదండరామాలయంలో సెప్టెంబరులో జరుగనున్న ఉత్సవాల వివరాలిలా ఉన్నాయి.

– సెప్టెంబరు 9, 16, 23, 30వ తేదీల్లో శనివారం ఉదయం 6 గంటలకు మూలవర్లకు అభిషేకం, సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవర్లకు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– సెప్టెంబరు 6న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం, సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవర్లను తిరుచ్చిపై శ్రీ రామచంద్ర పుష్కరిణికి ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు అక్కడే ఆస్థానం చేపడతారు.

– సెప్టెంబరు 15న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవర్లను తిరుచ్చిపై శ్రీ రామచంద్ర పుష్కరిణికి ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు అక్కడే ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– సెప్టెంబరు 20న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం, రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.